వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్ వార్తలు ... క్లారిటీ ఇచ్చిన బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ

|
Google Oneindia TeluguNews

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్టు జరిగిన ప్రచారంపై బీజేపీ నాయకులు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ నిన్న అస్వస్థతకు గురయ్యారు. 12 రోజులుగా ఎండలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కు వడ దెబ్బ తగిలిందని, ఆయన రెస్ట్ తీసుకోవలసిన అవసరం ఉందని వైద్యులు చెప్పినట్లుగా సమాచారం. సోడియం పొటాషియం లెవల్స్ లో తేడా గుర్తించిన వైద్యులు రెండు రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. మరి ఇంతకీ బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వబోతున్నారా లేదా పాదయాత్రను కొనసాగిస్తారా అన్న అంశంపై బిజెపి నాయకులు క్లారిటీ ఇచ్చారు.

రజాకార్ల పాలనలా టీఆర్ఎస్ పాలన; ఆడబిడ్డలకు రక్షణ లేదు: మండిపడిన బండి సంజయ్రజాకార్ల పాలనలా టీఆర్ఎస్ పాలన; ఆడబిడ్డలకు రక్షణ లేదు: మండిపడిన బండి సంజయ్

 పాదయాత్ర కు నో బ్రేక్ అన్న రాణి రుద్రమ

పాదయాత్ర కు నో బ్రేక్ అన్న రాణి రుద్రమ


బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ''ప్రజా సంగ్రామ యాత్ర'' రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి ఓ ప్రకటనలో వెల్లడించారు. బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర యధావిధిగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు మక్తల్ లో జరిగే బహిరంగ సభ అనంతరం రాత్రి బస చేసే శిబిరం నుండే రేపు యధావిధిగా పాదయాత్ర ప్రారంభమవుతుందని రాణి రుద్రమ వెల్లడించారు.

పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుందని చెప్పిన రాణి రుద్రమ

పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుందని చెప్పిన రాణి రుద్రమ


గత 12 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేయడంవల్ల బండి సంజయ్ వడ దెబ్బకు గురయ్యారు. దీనికితోడు ఎసిడిటీ సమస్య తోడవడంతో అస్వస్థతకు లోనయ్యారని రాణి రుద్రమ పేర్కొన్నారు. బండి సంజయ్ కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయన ఆరోగ్య రీత్యా పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించారు కానీ బండి సంజయ్ మాత్రం పాదయాత్ర కొనసాగించడానికే మొగ్గు చూపారని రాణి రుద్రమ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను యథావిదిగా కొనసాగనుందని ఆమె తెలిపారు. సమాచార లోపం వల్ల మాత్రమే పాదయాత్రకు రెండ్రోజులు విరామం ఇస్తున్నట్లు పొరపాటుగా వెలువరించడం జరిగిందని రాణి రుద్రమ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు.

 12వ రోజు పాదయాత్ర ఇలా

12వ రోజు పాదయాత్ర ఇలా


12వ రోజు ప్రజాసంగ్రామయాత్ర గొల్లపల్లి, దండు క్రాస్ మీదుగా సాగింది. మంతెనగోడు నుండి గొర్పల్లి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న తరువాత పన్నెండవ రోజు ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు మంచి భవిష్యత్తు కోసం భరోసా ఇవ్వడానికి ముందుకు సాగారు. బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత మక్తల్ టౌన్ లో ఈ రోజు పాదయాత్ర ముగుస్తుంది. రేపు యధావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ నేతలు బండి సంజయ్ పాదయాత్ర విషయంలో స్పష్టత ఇచ్చారు.

English summary
BJP state spokesperson Ranirudrama said that there is no truth in the news that the Bandi Sanjay's 'Praja Sangrama Yatra' will be postponed. She said that the public campaign organized by Bandi Sanjay will continue as usual.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X