సాధారణ ఎన్నికలే మాకు గీటురాయి, ఉపఎన్నికలు రావు: జానారెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సాధారణ ఎన్నికలే మాకు గీటురాయని తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని జానారెడ్డి చెప్పారు.

బుధవారం నాడు జానారెడ్డి రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై ప్రసంగించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితే లేదన్నారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించినా, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని జానారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

No chance to coming bypolls in Telangana:Jana Reddy

దేశానికి కాంగ్రెస్ పార్టీయే హీరో అని జానారెడ్డి జోస్యం చెప్పారు. ఉప ఎన్నికలు మాకు ఓ లెక్క కాదన్నారు. ఉప ఎన్నికలను తాము అసలు పరిగణనలోకి తీసుకోబోమని చెప్పారు. సాధారణ ఎన్నికలే గీటురాయిగా జానారెడ్డి చెప్పుకొచ్చారు.

జోగులాంబ గద్వాల బంద్ కు కాంగ్రెస్ పిలుపు

ఆలంపూర్ ఎమ్మెల్యే శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడాన్ని నిరనిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా బంద్‌కు గురువారం నాడు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గాంధీభవన్‌లో రెండు రోజుల దీక్షలో ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is no chance to coming bypolls in Telangana state said CLP leader Jana Reddy, He addressed a meeting at Hyderabad on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి