'ఓటుకు నోటు కేసులో రాజీలేదు, పకడ్బందీ కోసం ఏసీబీ వ్యూహం'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రాజీ వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఒకసారి కేసు నమోదైన తర్వాత ఎలాంటి రాజీ ఉండదన్నారు. కేసును పకడ్బంధీగా పెట్టేందుకు అధికారులు సమయం తీసుకుంటున్నారని చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్ిర నారా చంద్రబాబు నాయుడు ఈ కేసులో అడ్డంగా దొరికారన్నారు. స్టీఫెన్ సన్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదని కానీ, స్టీఫెన్ సన్‌తో తాను ఫోన్లో మాట్లాడలేదన కానీ, ఆడియోలో ఉన్నది తన స్వరం కాదని కానీ చంద్రబాబు చెప్పలేదన్నారు. చంద్రబాబు తప్పు చేసినట్లే అన్నారు. బీజేపీ తన వైఖరి చెప్పాలన్నారు.

ప్రభుత్వంపై జరిగే దాడులను తిప్పికొడదాం: దేవిప్రసాద్
టీజీవో భవన్‌లో సెక్షన్ 8పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో టీఎన్‌జీవో గౌరవ అధ్యక్షులు దేవీ ప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వంపై జరిగే దాడులను తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజ్యంగ వ్యతిరేక చర్యలకు ఉపక్రమించేలా కుట్రలు చేస్తున్నారు.
ఇరు ప్రాంతాల ప్రజల మధ్య భయోత్పత పరిస్థితులు సృష్టిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై దాడులు జరిగితే సహించేది లేదన్నారు. హైదరాబాద్‌పై జరుగుతున్న కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications