అతనికి నెగిటివ్: తెలంగాణలో ఒక్క కరోనా కేసు లేదు: ఈటెల రాజేందర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో మంత్రి ఈటెల సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతీ ప్రయాణికుడినీ స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు.
దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని మంత్రి ఈటెల తెలిపారు. బుధవారం మరోసారి దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా నయమైందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కూడా లేదని స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో కూడా కరోనా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూలున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటెల వివరించారు.
Recommended Video

కాగా, ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారే ఈ వైరస్ బారినపడుతున్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్తంగా కరోనావైరస్ నివారణ చర్యలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications