తెలుగు వారు బాగుండాలి: మంత్రి హరీశ్‌తో విభేదాలు లేవన్న కేటీఆర్
హైదరాబాద్: తనకు, మంత్రి హరీశ్‌రావుకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల్ని ప్రజలుగానే చూస్తున్నామన్నారు.
హైదరాబాద్ మినీ భారత్ అని పేర్కొన్నారు. నగరంలో 29 రాష్ట్రాలకు చెందిన పౌరులున్నారని అందరినీ సమానంగానే చూస్తున్నామన్నారు. నెలన్నర రోజులుగా ప్రజల్లోనే తిరుగుతున్నామని చెప్పిన ఆయన ఏ పని చేసినా నిబద్ధతో చేస్తామన్నారు.
ఉద్యమ సమయంలో పరుషంగా మాట్లాడిన మాట నిజమేనని, అవతలి వారు గట్టిగా మాట్లాడినప్పుడు, మేము గట్టిగా మాట్లాడామన్నారు. మాటల తూటాలు మామీద కూడా పేలాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడక ముందు మాపై విషప్రచారం చేశారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవంగా ఆచరణలో చూపెట్టామన్నారు. గతంలో ఉన్న అనుమానాలు మాపై లేవన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిరికీ వర్తిస్తాయి కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల మద్దతు ఉంటుందన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరం రాజకీయంగానే ఎదుగుతున్నామన్నాని చెప్పిన ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా దానిని సాధిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో నివసిస్తోన్న సెటిలర్స్‌లో టీఆర్ఎస్‌పై ఆదరణ పెరిగిందన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మా మిత్రులైన రాజులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వారు ఏపీలో చంద్రబాబు కంటే సీఎం కేసీఆర్‌కే మంచి పాపులారిటీ ఉందని చెప్పారన్నారు. ఆ సందర్భంలో టీఆర్ఎస్‌ను తెలుగు రాష్ట్ర సమితి మారిస్తే బాగుంటుందనే కామెంట్ సరదానే వ్యాఖ్యానించానన్నారు.
తెలుగు వారు బాగుండాలని, రెండు రాష్ట్రాల ప్రజలు ఇంకా బాగుండాలని కోరుకుమే వాళ్లమన్నారు. కాగా, భీమవరం నుంచి పోటీ చేస్తాననే వ్యాఖ్యలపై స్పందిస్తూ సరదాగా వ్యాఖ్యానించానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కేసీఆర్‌కు ఆదరణ ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. వారం రోజుల్లో గ్రేటర్ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. గ్రేటర్ ఫలితాల తర్వాతే మేయర్ అభ్యర్ధిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications