Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పూల బొకేలు వద్దు... నోటు పుస్తకాలు ముద్దు... కిషన్ రెడ్డి ప్రకటనకు అనుహ్య స్పందన

ప్రజాస్వామ్యంలో చాల మంది రాజకీయ నాయకులు వస్తు ఉంటారు. పదవి కాలం అయి పోయాక తిరిగి ప్రజల్లో కనపడకుండా వెళతారు. కాని కొంతమంది మాత్రం కొన్ని రోజులు అధికారంలో ఉన్నా ...రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా ప్రజల సోమ్మును దుర్వినియోగం చేయకుండా ఇతర నాయకులకు,ప్రజలకు ఆదర్శంగా ఉంటారు. దీంతో ప్రజల సోమ్మును అనవసర కార్యకలాపాలకు ఉపయోగపడకుండా పలు నిర్ణయాలు తీసుకుంటారు.

బీజేపీ ఎంపీలతో కార్యకర్తల్లో జోష్

బీజేపీ ఎంపీలతో కార్యకర్తల్లో జోష్

ఈనేపథ్యంలోనే మొదటీ సారీ ఎంపీగా గెలిచిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇలాంటీ నిర్ణయాన్నే తీసుకున్నారు. ఆయన గతంలోనే ఎమ్మెల్యేగా మూడు సార్లు అంబర్‌పేట నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. అయితే నాలుగోసారి పోటి చేసిన కిషన్ రెడ్డి అతి స్వల్ప ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటి చేసే అవకాశం రావడంతో ఆయన అక్కడి నుండి పోటి చేసి గెలిచారు.

పూల బోకేలు, దండల వల్ల ప్రయోజన ఉండదన్న కిషన్ రెడ్డి

దీంతోపాటు రాష్ట్ర్రంలో నలుగురు ఎంపీలు చాల సంవత్సరాల తెలంగాణ నుండి గెలిచి ఢిల్లీలో అడుగు పెట్టపోబోతున్నారు. ఈనేపథ్యంలోనే పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. కుప్పలు తెప్పలుగా పార్టీ నాయకులను కలిసేందుకు రాష్ట్ర్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. నాయకులను కలిసేటప్పుడు పూల దండలు. పూల బోకేలు,శాలువలు తీసుకువస్తున్నారు. దీంతో అవి అలా తీసుకుని ఇలా పడేయడం తప్ప వాటి వల్ల ప్రయోజనం మాత్రం ఉండదు.

కిషన్ రెడ్డి ప్రకటనకు స్పందించిన కార్యకర్తలు

దీంతో మొదటిసారీ ఎంపీ అయినా కిషన్ రెడ్డి బోకేలు పూలదండలపై ఓ నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసే వాళ్లు ,అభినందించేవాళ్లు పూలబోకేలు, దండలు తేకుండా కట్టడి చేశారు. వాటికి బదులు విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ పుస్తకాలు తేవాలని కార్యకర్తలకు సూచించారు. వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వడం ద్వార బీద విద్యార్థులకు ఉపయోగపడతాయని భావించారు.

ప్రభుత్వ స్కూల్‌ను తీర్చిదిద్దిన కిషన్ రెడ్డి...

సో అయన సూచించడంతో కార్యకర్తల్లో కూడ స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున పూల బోకేలకు బదులు, నోట్‌బుక్‌లను అందించి అభినందనలు తెలుపుతున్నారు. ఇలా ఆయన ప్రకటించిన ఒక్క రోజులోనే వందలాదీ మంది కార్యకర్తలు నోట్‌బుక్‌లను అందించారు. దీంతో వాటిని ప్రభుత్వ పాఠాశాలలో ఇచ్చేందుకు ఆయన సిద్దమవుతున్నారు. కాగా అంబర్ నియోజకవర్గంలో సుమారు వెయ్యి మంది విద్యార్థులతో కూడిన ప్రభుత్వ పాఠశాల ఉంది. దాన్ని మంచి ఫలితాలు వచ్చే విధంగా కిషన్ రెడ్డి ఉపాధ్యాయుల సహకారంతో తీర్చిదిద్దాడు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం ఆయన దగ్గరకు రికమండేషన్ కోసం వస్తారంటే అతిశయోక్తి కాదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+