వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంతుల్లో మెరిసిన చరిత: అంతలోనే భ్రాంతి..

కాకతీయుల గడ్డ పౌరుషాగ్నులు, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది.. తరతరాలూ గుర్తుంచుకోదగిన ఈ చరిత పుస్తకాలు, కొన్ని సినిమాలకే పరిమితమమయ్యాయి.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: కాకతీయుల గడ్డ పౌరుషాగ్నులు, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది.. తరతరాలూ గుర్తుంచుకోదగిన ఈ చరిత పుస్తకాలు, కొన్ని సినిమాలకే పరిమితమమయ్యాయి.

అదీ అసంపూర్ణమే.. ఓరుగుల్లు నగర చరిత్ర, నాటి రాజుల సాహసోపేత యుద్ధాలు, ఆ నాటి శిల్పకళా వైభవం.. సంస్కృతీ సంప్రదాయాలు... వీటన్నినీ కళ్లకు కట్టినట్లు చూపించడానికి లేజర్‌ కాంతుల ప్రదర్శనను ప్రభుత్వం ప్రారంభించి, మూన్నాళ్ల ముచ్చటగా మిగిల్చింది.

No light show at Warangal kota.

కాకతీయ ఉత్సవాల సందర్భంగా 2013 డిసెంబర్‌ 20న రూ. 4 కోట్ల వ్యయంతో వరంగల్‌ కోటలో ప్రారంభించిన ఈ కాంతుల ప్రదర్శనను (లైట్ అండ్‌ షో) అప్పటి కేంద్రమంత్రి బలరాంనాయక్‌, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించారు.

ఈ ప్రదర్శన మూతపడి కొన్ని నెలలైనా మరమ్మతుల్లేవు. కోట వైభవాన్ని తెలుసుకోవాలనే సంకల్పంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రదర్శనలేదని తెలిసి నిరాశ చెందుతున్నారు. మరమ్మతులకు టెండర్లు పిలిచామని, త్వరలో పునః ప్రారంభిస్తామని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ చెబుతున్నారు.

English summary
No light show at Warangal kota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X