2అంశాలపై కేసీఆర్‌ను ఏకేసిన టీడీపీ, బీజేపీ: డెడ్‌లైన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తదితరులు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళితులకు అన్యాయం చేస్తున్నారని, నల్గొండ జిల్లా కాల్పుల ఘటన పైన వారు ఏకిపారశారు.

బాబు జగ్జీవన్ రామ్‌కు దండ వేసే అర్హత కేసీఆర్‌కు లేదని మోత్కుపల్లి అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందన్నారు. ఒక్క దళితుడుకూడా మంత్రి పదవికి అర్హుడు కాదా అని ప్రశ్నించారు. సమాజంలో ఆరు శాతం ఉన్న సామాజికవర్గం నుంచి వచ్చిన కేసీఆర్‌ 90శాతం పెత్తనం చేస్తున్నారన్నారు.

కేసీఆర్‌ సీఎం అయ్యాక తెలంగాణ తల్లి తల్లడిల్లుతోందన్నారు. విమలక్కపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్ జయంతిలోపు దళితులకు న్యాయం చేయకుంటే తెరాస నేతలను ఊళ్లో తిరగనివ్వమని డెడ్ లైన్ విధించారు. నిజాంపై నాడు అందరు కలిసి పోరాడితే, నేడు అదే నిజాంను కేసీఆర్ పొగిడే పరిస్థితికి తెచ్చారన్నారు.

No one dalit leader in KCR cabinet: TDP and BJP

కేసీఆర్ పునాదులు కదులుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు. కుంభకోణాలు, భూకబ్జాలతో కేసీఆర్‌ , మంత్రులు ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 14లోగా దళితులకు కేబినెట్‌లో చోటు కల్పించాలని, లేకుంటే టీఆర్‌ఎస్‌ నేతలను ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబం దండుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. దీనిని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.

తెలంగాణలో టీడీపీ పని ఖతం కావడం కాదని, కేసీఆర్ కుటుంబమే రాజకీయంగా ఖతమవుతుందన్నారు. కరవు నుండి రైతులను బయడపడేసే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయడం లేదన్నారు.

నల్గొండ జిల్లా కాల్పుల ఘటన పైన మాట్లాడుతూ.. పోలీసులు బాగా పని చేశారని కితాబిచ్చారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న ప్రత్యేక బృందాన్ని పంపిస్తే మరింత బాగుండేదన్నారు. ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తే ఇంత నష్టం జరగకపోయి ఉండేదన్నారు. కాగా, రాజయ్య బర్తరఫ్‌ను నిరసిస్తూ మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది.

ఎన్ఐఏ దర్యాఫ్తుకు సహకరించాలి: కిషన్ రెడ్డి

ఎన్‌కౌంటర్‌లో హతమైన దుండగులు దోపిడీ దొంగలేనని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి నిర్లక్ష్యంగా ప్రకటిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాల్పుల ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలన్నారు.

పోలీసులకు ఆధునిక ఆయుధాలు ఇవ్వాలన్నారు. పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు సహకరించాలన్నారు. గత ప్రభుత్వాల ఉదాసీనత వల్ల ముగ్గురు పోలీసులను కోల్పోయామన్నారు. కేబినెట్లో దళితులకు చోటివ్వకుండా తెరాస అవమానించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+