వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం.!కేసీఆర్ కు కల్వకుంట ప్రధాని కేంద్ర మంత్రులు.!ఐనా వెయిటింగ్.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : నాలుగు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి బృందం ఢిల్లీలో మకాం వేసి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ తో పాటు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పియూష్ వేదప్రకాష్ గోయల్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ తప్ప మరే ఇతర కేంద్ర మంత్రులు సీఎం బృందానికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ప్రధానంగా ప్రధాని మోది, గంజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యేందుకు తెలంగాణ సీఎం ఆసక్తి చూపిస్తున్నప్పటి వారి అపాయింట్ మెంట్ గగనంగా మారింది. దీంతో నాటుగు రోజులుగా చంద్రశేఖర్ రావు, ఆయన మంత్రుల బృందం కేంద్ర పెద్దల సంప్రదింపుల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని నో అపాయింట్ మెంట్..

ప్రధాని నో అపాయింట్ మెంట్..

అంతే కాకుండా సీఎం ఢిల్లీ పర్యటన పీరిలేవదు, కట్టె కాలదు అన్న చందంగా తయారయ్యందని ప్రతిపక్ష పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. బీజేపి, సీఎం చంద్రశేఖర్ రావు డ్రామాలో భాగంగానే కేంద్ర మంత్రులు సీఎం చంద్రవేఖర్ రావును సంప్రదించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఢిల్లీ తెలంగాణ భవన్ లో బిల్లులు రెట్టింపవ్వడం మరో ప్రయోజనం ఉండదని, రోడ్ల మీద ఆరబెట్టిన వరి ధాన్యం మొలకెత్తి మరోసారి కాపుకొచ్చే సమయం వరకూ చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో అడుగు పెట్టరని ప్రతిపక్షనేతలు ఎద్దేవా చేస్తున్నారు. అసలు ధాన్యం సేకరణ అంశం ముగిసిన అధ్యయమని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మకాం వేసారని మండిపడుతున్నారు ప్రతిపక్షనేతలు.

 కనికరించని కేంద్రం..

కనికరించని కేంద్రం..

అంతే కాకుండా ధాన్యం సేకరణపై ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రులతో భేటీ అయింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ధాన్యం సేకరణ విషయంపై విషయం ఎటూ తేలకుండానే సమావేశం ముగిసింది. అయితే మరోసారి భేటీ కావాలని మంత్రుల బృందం నిర్ణయించుకుంది. అయితే మరోసారి భేటీపై స్పష్టత రావాల్సి ఉంది.

కేంద్రమంత్రులతో భేటీ అయిన రాష్ట్ర మంత్రులు..

కేంద్రమంత్రులతో భేటీ అయిన రాష్ట్ర మంత్రులు..

తెలంగాణ నుంచి రెండు సీజన్లలో ధాన్యం సేకరించాలని, అందులో భాగంగా 100 నుంచి 200 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రుల బృందం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి మేరకు, ఏ సీజన్‌లో ఎంత ధాన్యం ఉంటుందనే విషయంపై స్పష్టత కావాలని కేంద్రం కోరింది. సరైన ప్రణాళికతో సవివరంగా వస్తే నిర్ణయం తీసుకునేందుకు వీలు ఉంటుందని కేంద్రం తెలిపింది. మెుదట కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పియూష్ వేదప్రకాష్ గోయల్ తో సమావేశం అయిన మంత్రులు, ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అవసరాలపై కేంద్రమంత్రికి వివరించారు.

రెండో సారి కలిసేందుకు సన్నాహాలు..

రెండో సారి కలిసేందుకు సన్నాహాలు..

మంత్రుల బృందం ప్రతిపాదించిన కొన్ని అంశాలపై తోమర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నెల 26న మరోసారి రాష్ట్ర ప్రతినిధులు, గోయల్‌ తో మరోసారి సమావేశం అవ్వనున్నారు. ఆ రోజైనా, ధాన్యం కొనుగోలుపై తుది నిర్ణయం వస్తుందని మంత్రులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులతో జరిగిన చర్చల గురించి వివరించారు. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని సీఎం చంద్రశేఖర్ రావు చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ఆదివారం ఢిల్లీకి వెళ్లారు.

English summary
The Telangana Chief Minister's delegation has been staying in Delhi for four days awaiting the appointment of Prime Minister Narendra Modi and Union Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X