వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో పవన్‌కు ఏం సంబంధం, జనసేనకు ఓటింగ్ లేదు: ఉత్తమ్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణలో పవన్‌కు ఏం పని ? రేవంత్ రెడ్డి వల్లే !

హైదరాబాద్: తెలంగాణలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు పెద్దగా ఓటింగ్ ఉండదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణతో పవన్‌కు ఏం సంబంధం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వారిని కెసిఆర్ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వ్యతిరేకుల్ని దగ్గరకు తీస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు ఉత్తమ్ చెప్పారు.

పవన్ కు తెలంగాణకు ఏం సంబంధం

పవన్ కు తెలంగాణకు ఏం సంబంధం

తెలంగాణలో జనసేనతో తమకు ఎలాంటి నష్టం ఉండదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పవన్ కళ్యాణ్‌కు ఏం సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు పెద్దగా ఓటింగ్ ఉండదని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ సభలకు జనం వచ్చినా పెద్దగా ఓట్లు రావని ఉత్తమ్ చెప్పారు.

దమ్ముంటే జైల్లో పెట్టాలి

దమ్ముంటే జైల్లో పెట్టాలి

కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాము తమ గళాన్ని విన్పిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న చట్టం గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గతంలో ఏ విధంగా మాట్లాడామో ఇప్పుడు కూడ అదే విధంగా మాట్లాడనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దమ్ముంటే జైల్లో పెట్టాలని ఉత్తమ్ సవాల్ విసిరారు.

 రేవంత్ వల్ల పార్టీ బలం పెరిగింది

రేవంత్ వల్ల పార్టీ బలం పెరిగింది

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తమ పార్టీ బలం మరింత పెరిగిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించే విషయమై ఎఐసిసి నాయకత్వం కసరత్తు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

 టిఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు.

టిఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు.

టిఆర్ఎస్ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కెసిఆర్ కుటుంబంపై ప్రజలు అసంతృప్తితొ ఉన్నారని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.ఈ కారణంగానే టిఆర్ఎస్ నేతలు కూడ తమతో టచ్‌లోకి వస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో పరిణామాలన్నీ తమకు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని ఉత్తమ్ ధీమాను వ్యక్తం చేశారు.

కెసిఆర్‌కు అసహనం

కెసిఆర్‌కు అసహనం

తెలంగాణ సీఎం కెసిఆర్ కు అసహనం పెరిగిపోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలపడడంతో పాటు అహంకారం పెరిగిపోవడం కూడ కెసిార్‌లో అసహనం పెరగడానికి కారణంగా మారిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

English summary
C Chief Uttamkumar Reddy said that Janasena chief Pannan Kalyan has no big voting in Telangana.A Telugu channel interviewed him on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X