• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరగాల్సింది గుళ్ళు కాదు.!కేసీఆర్ అమరవీరుల ఇండ్లు తిరిగితే పుణ్యం వస్తుందన్న దాసోజు శ్రవణ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణకు అమరవీరులే దేవుళ్ళని, అమరుల కుటుంబాలని పరామర్శించి అమరుల ఫొటోకు దండ వేసి నివాళి అర్పిస్తే వేయి గుళ్ళు తిరిగిన పుణ్యం వస్తుందని ఏఐసిసి అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ స్పష్టం చేసారు. వేలాది మంది యువకుల ఆత్మ త్యాగాల తర్వాత కానీ తెలంగాణ సాకారం కాలేదని, కానీ నేడు అధికార మదంతో దున్నపోతు మీద వాన కురిసినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అమరవీరులు కుటుంబాలకు న్యాయం చేయకపోగా వారిని అవమానించే రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని దాసోజ్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేసారు.

 అమరుల కుటుంబాల పట్ల కేసీఆర్ కు సోయి లేదు.. అమరుల కుటంబాలతో గన్ పార్క్ లో దాసోజు శ్రవణ్ నిరసన

అమరుల కుటుంబాల పట్ల కేసీఆర్ కు సోయి లేదు.. అమరుల కుటంబాలతో గన్ పార్క్ లో దాసోజు శ్రవణ్ నిరసన

అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసేదెప్పుడు.? అమరుల కుటుంబాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయి లేదా? అమరులని అవమానించడం సీఎం చంద్రశేఖర్ రావు సర్కార్ కి తగదని అన్నారు. 1560 మంది తెలంగాణ కోసం అమరులైతే కేవలం 576 మందిని గుర్తించడం దారుణమైన అంశం అని, అమరుల కుటుంబాలకు పది లక్షల రూపాయిల సాయం, కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, సాగుకు యోగ్యమైన మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు వెంటనే కేటాయించాలని దాసోజు శ్రవణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

 కేసీఆర్ గుడులు గోపురాలు తిరిగితే ఏమీ రాదు.. అమరుల ఇండ్లకు వెళ్లాలన్న శ్రవణ్

కేసీఆర్ గుడులు గోపురాలు తిరిగితే ఏమీ రాదు.. అమరుల ఇండ్లకు వెళ్లాలన్న శ్రవణ్

అంతే కాకుండా అమరవీరులను గౌరవించడం, వారి కుటుంబాలకు సంక్షేమం కల్పించడం సామాజిక భాద్యత అని, దీనిని విస్మరించడం ఘోరమైన నేరమని,అమరులకు గౌరవం, వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని శ్రవణ్ స్పష్టం చేసారు. సీఏం చంద్రశేఖర్ రావు పుణ్యం కోసం గుడులు గోపురాలు తిరుగుతున్నారని, కానీ చంద్రశేఖర్ రావు తిరగాల్సిన గుడులు అమరవీరుల నివాసాలని శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఏఐసిసి అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్.

 కేసీఆర్ దీక్షతో కాదు.. యువకుల బలిదానాలతో తెలంగాణ సిద్దించిందన్న శ్రవణ్

కేసీఆర్ దీక్షతో కాదు.. యువకుల బలిదానాలతో తెలంగాణ సిద్దించిందన్న శ్రవణ్

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలతో కలసి గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో తెలంగాణ ఉద్యమకారులు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్యతో కలసి మాట్లాడారు. తెలంగాణ ఒక్కరి పోరాటం వలన వచ్చిన రాష్ట్రం కాదని, సబ్బండ వర్గాల ప్రజల పోరాటం, వేలాది మంది యువకుల ఆత్మ త్యాగాల తర్వాత కానీ తెలంగాణ సాకారం కాలేదని, అమరవీరులు కుటుంబాలకు న్యాయం చేయకపోగా వారిని అవమానించే రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు దాసోజు శ్రవణ్. 2014 టీఆర్ఎస్ మ్యానిఫెస్టో తయారు చేసిన కమిటీలో తానూ ఓ సభ్యుడినని, ఆనాడు ఎంతో భావోద్వేగంతో అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని అనేక అంశాలు పొందుపరిచామని గుర్తు చేసారు.

 అమరుల రక్తపు మడుగుల మీద కర్చీ వేసుకుని కూర్చున్నారు.. వారి కుటుంబాలను ఆదుకోవాలన్న దాసోజు శ్రవణ్

అమరుల రక్తపు మడుగుల మీద కర్చీ వేసుకుని కూర్చున్నారు.. వారి కుటుంబాలను ఆదుకోవాలన్న దాసోజు శ్రవణ్

నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అనుభవిస్తున్న అధికారం, దర్పం, అమరవీరుల త్యాగఫలమని, అమరుల రక్తపు మడుగులపై టీఆర్ఎస్ నాయకులు కుర్చి వేసుకొని కూర్చున్నారనే సంగతి మర్చిపోవద్దని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఎమ్మెల్యేలకు ఆఫీసులు, బంగ్లాలు ఫాం హౌస్ లు చిటికలో వస్తాయి కానీ అమరవీరులకు స్తూపాలు ఎందుకు నిర్మితం కావడం లేదని మండిపడ్డారు. ప్రతి జిల్లా హెడ్ క్యార్టర్ లో అమరవీరుల స్థూపం కడతామని చెప్పారని, కానీ ఇప్పటివరకూ దాని జాడలేదని, అమరవీరులకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే మరో పోరాటం తప్పదని దాసోజు శ్రవణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

English summary
Dasoju Shravan along with Telangana activists Pasham Yadagiri and Gade Innayya spoke at a media conference organized at Gun Park with the families of the martyrs who lost their lives in the Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X