'తెలంగాణ ఆధీనంలోనే హైదరాబాద్, పోలీసులకు వీక్లీ ఆఫ్ కుదరదు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే హైదరాబాద్ ఉంటుందని, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలను తెలంగాణ పోలీసులే చూసుకుంటారని డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. వరంగల్‌లోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల తరహాలో వరంగల్ కమిషనరేట్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారిన 'ఓటుకు నోటు' వ్యవహారాన్ని ఏపీసీ చూసుకుంటుందని చెప్పారు. పోలీసు శాఖ సిబ్బందిని పెంచే వరకు పోలీసులకు వారినికో సెలవు ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు.

తెలంగాణలో సుమారు 18 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణదేనని, సెక్షన్ 8 అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని అన్నారు.












Click it and Unblock the Notifications