మంజూరైన ఋణం ఇవ్వలేదని... బ్యాంకు ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు
బ్యాంకు అధికారుల తీరుతో విసిగి పోయిన ఓ రైతు బ్యాంకు ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన పేరు మీద మంజూరు చేసిన రుణాన్ని బ్యాంకు అధికారులు పంపిణీ చేయకపోవడంతో ఆ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలంలోని చెరువు ముందు తండాకు చెందిన రైతు జె సర్వన్ గొర్రెల కొనుగోలు కోసం ప్రభుత్వం నుంచి రుణం కోసం దరఖాస్తు చేయగా, రూ .1.30 లక్షల రుణం మంజూరు చేశారు. అయితే బ్యాంక్ అధికారులు ఏవో సాకులు చెబుతూ ఆ రుణం తాలూకు నగదును సదరు రైతుకు ఇవ్వకుండా బ్యాంకు చుట్టూ తిప్పించుకుంటున్నారు . మంజూరు చేసిన మొత్తాన్ని తన బ్యాంక్ ఖాతాకు పంపిణీ చేయడానికి సంబంధించి, సర్వన్ గత సంవత్సరంన్నర నుండి నిరంతరం బ్యాంకుకు వస్తూనే ఉన్నాడు. అప్పటి నుండి ఇప్పటివరకు, బ్యాంకు అధికారులు ఏవో కారణాలు చెప్పి సదరు రైతు డబ్బును విడుదల చేయడం లేదు.

దీంతో విసిగిపోయిన రైతు తీవ్ర నిరాశతో బ్యాంకు వద్దనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎప్పటిలాగే సోమవారం ఐఓబి మహబూబాబాద్ శాఖకు వెళ్లి రుణ మొత్తంపై అధికారులను అడిగారు. బ్యాంకు అధికారుల నుండి సరైన సమాధానం లేకపోవడంతో, సర్వన్ బ్యాంకు ప్రాంగణంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆ రైతును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ అధికారులను విచారించడంతో పాటుగా దర్యాప్తు చేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications