వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిర్యానీ కాదు: కెసిఆర్ మాటకు ఇవాంక ట్విస్ట్ ఇలా...

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మంగళవారం తన ప్రారంభోపన్యాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబబాద్ బిర్యానీ ప్రశస్తి గురించి మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మంగళవారం తన ప్రారంభోపన్యాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబబాద్ బిర్యానీ ప్రశస్తి గురించి మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ గమ్మత్తయిన ట్విస్ట్ ఇచ్చారు.

Recommended Video

Made in India Robot 'Mitra' at GES : ప్రధాని, ఇవాంకలకు ‘మిత్ర' స్వాగతం

ముత్యాల నగరంగా ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్‌పై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాదులో జరుగుతున్న సాంకేతికాభివృద్ధి బిర్యానీ ప్రశస్తిని వెనక్కి నెట్టేస్తుందని ఆమె అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేటివ్ హబ్‌గా రూపు దిద్దికుంటోందని ఆమె అన్నారు.

కెసిఆర్ ఏమన్నారు...

కెసిఆర్ ఏమన్నారు...

హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామంలా ఉన్న హైదరాబాద్‌వైపు యావత్ దేశంతోపాటు ప్రపంచం చూస్తున్నదని అన్నారు. ప్రపంచంలోని ఐదు ప్రముఖ, ప్రతిష్ఠాత్మక కంపెనీలు అమెరికా తరువాత ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిని వీక్షించడంతోపాటు నగర ప్రత్యేక వంటకమైన బిర్యానీని రుచి చూడాలని ఆయన కోరారు.

బిర్యానీలోనే కాదు..

బిర్యానీలోనే కాదు..

బిర్యానీలోనే కాదు, టెక్నాలజీలోనూ హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిందని ఇవాంక ట్రంప్ చెప్పారు. భారత్‌లో ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని, ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్ నిలుస్దుందని ఆమె అన్నారు.

ఇది అద్భుతం...

ఇది అద్భుతం...

సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాచీన హైదరాబాదు నగరానికి రావడం తనకు అద్భుతంగా ఉందని ఇవాంక ట్రంప్ అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ బిర్యానీని టెక్ సెంటర్ల పరిమళం అధిగమిస్తుందని ఆమె అన్నారు.

ఇవాంక

ఇవాంక

తన ప్రసంగంలో ఇవాంక ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. భారత ప్రజానీకాన్ని కూడా ఆమె పొగడ్తలతో ముంచెత్తారు. చాయ్‌వాలా నుంచి భారత ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ ప్రయాణం చాలా ప్రశంసనీయమైందని ఆమె అన్నారు.

English summary
vanka Trump, said, "It is wonderful to be in this ancient city brimming with transformative technology - now, your tech centers may even outshine your world-famous Biryani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X