జంక్షన్ లు జామ్ అయ్యే ప్రసక్తే లేదు.!జీహెచ్ఎంసీ వినూత్న పథకం.!
హైదరాబాద్ :హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరంలో జన సాంద్రత పెరగడంతో పాటుగా వాహనాల రద్దీ వివరీతంగా పెరిగిందని నగరపాలక సంస్థ స్పష్టం చేస్తోంది.పెరిగిన ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రజా రవాణా ఇబ్బందులను తొలగించేందుకు జిహెచ్ఎంసి జంక్షన్ ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న రోడ్డు వ్యవస్థను విస్తరించడం మూలంగా వాహన రద్దీ కూడా పెరిగింది. దాంతో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాల్సిన అవశ్యకత ఏర్పడిందని నగర పాలక అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ సూచన మేరకు నగర వ్యాప్తంగా 90 జంక్షన్ లను అభివృద్ధి చేసేందుకు బృహత్కర చర్యలు చేపట్టారు నగర పాలక సంస్థ అధికారులు. జంక్షన్ ల విస్తరణ పనుల బాధ్యతలను జోనల్ కమిషనర్లకు అప్పగించారు. మొత్తం 90 కూడళ్లను అభివృద్ది చేయాల్పిందిగా గుర్తించి పనులకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసారు అధికారులు.

జంక్షన్ల అభివృద్ది పనుల్లో 69 జంక్షన్ల పనులు పూర్తి కాగా మిగితా 11 పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 14 కూడళ్ల పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు అధికారులు దృవీకరిస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ లో అన్ని జోన్ల కంటే ఎక్కువగా పనులను చేపట్టారు. ఎల్.బి నగర్ జోన్ లో మొత్తం 11 జంక్షన్ విస్తరణ అభివృద్ధి చేపట్టగా 7 పూర్తి చేసారు. ఒక విస్తరణ కార్యక్రమం ప్రోగ్రెస్ లో ఉండగా 3 పనులు ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా చార్మినార్ జోన్ లో 9 చేపట్టగా 7 పూర్తి చేశారు. ఒకటి ప్రోగ్రెస్ ఇంకొకటి త్వరలో పనులను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఖైరతాబాద్ జోన్ లో 34 జంక్షన్ లకు గాను 22 పూర్తి చేశారని, 5 పనులు పురోగతిలో ఉన్నాయని, మిగితా 7 పనులు త్వరలో ప్రరంభించనున్నారని తెలుస్తోంది. శేరిలింగం పల్లిలో 11 పనులలో 7 పూర్తి కాగా మిగితా 1 పురోగతిలో ఉండగా మరో 3 త్వరలో పనులు చేపట్టనున్నారు. కూకట్ పల్లిలో 10 చేపట్టగా 9 పూర్తి కాగా మరొకటి అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. సికింద్రాబాద్ జోన్ లో మొత్తం 15 జంక్షన్ లు అభివృద్ధి చేయాలని నిర్ణయించగా 13 పూర్తి కాగా మరో 2 పురోగతి దశలో ఉన్నాయని, వాటన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయనున్నామని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications