139 చోరీలు: పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ, లాయర్ల ఇళ్లలోనూ..
హైదరాబాద్: హైదరాబాదులో పెద్ద యెత్తున చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ పోలీసుల చేతికి చిక్కాడు. 1992 నుంచి హైదరాబాదు నగరంలో అతను 139 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చోరీలకు పాల్పడి పోలీసులకు దొరికిపోవడం, బెయిల్ కోసం సొంతంగా స్టేట్‌మెంట్ తయారు చేసుకోవడం, సంతకం కోసం న్యాయవాది దగ్గరకు వెళ్లడం, న్యాయవాది అంగీకరించకుంటే అక్కడ కూడా చోరీకి పాల్పడడం అతనికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
ఆ ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేసి అతను నుంచి రూ.12లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడిచారు.
మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం నెల్లికుదురకు చెందిన పులిజాల చినఎల్లయ్య అలియాస్ మల్లయ్య అలియాస్ చిన్న అలియాస్ హెచ్‌కే విజయ్ కుమార్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో నివసిస్తున్నాడు. మోటర్‌సైకిల్ దొంగతనం కేసులో 1992లో పంజాగుట్ట పోలీసులు చిన ఎల్లయ్యని మొదటిసారిగా అరెస్ట్ చేశారు.

అతను మెకానిక్. అయితే దొంగతనాలు చేయడమే వృత్తిగా మార్చుకున్నాడు. అనేక ఇళ్ళల్లో నగలు డబ్బు, మోటర్ సైకిళ్ల, ఎలకా్ట్రనిక్ పరికరాల దొంగతనాలు చేశాడు. పదో తరోగతి వరకే చదివిన అనతు న్యాయశాస్త్రంలో మెళకువలు సాధించి బెయిల్‌పై బయటికి వచ్చేవాడు. తర్వాత దొంగతనం చేసిన డబ్బుతో విలాసవంతంగా జీవించేవాడు.
చిన ఎల్లయ్యపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 17 పోలీస్‌స్టేషన్లలో ఇప్పటి వరకు 139 దొంగతనాల కేసులు ఉన్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు 1998 నుంచి సిటీ డోషియల్ క్రిమినల్‌గా అతడిపై షీట్ కొనసాగిస్తున్నారు. చినఎల్లయ్యను ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మే 3వ తేదీన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి ఇంట్లోనూ చోరీ చేశాడు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో పగలు రెక్కీ నిర్వహిస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను, ఫ్లాట్‌లను ఎంచుకొని రాత్రికి ఆ ఇళ్లలోకి దూరి అందిందల్లా పట్టుకుపోతాడు. నిందితుడి నుంచి టాటా సుమో వాహనం సహా 14 తులాల బంగారు ఆభరాణలు, లక్షన్నర నగదు, లాప్‌టాప్‌లతో సహా మొత్తం రూ.12లక్షల విలువైన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications