డ్రగ్స్ కేసులో కీలక మలుపు: విచారణకు రావాలంటూ నవదీప్‌కు నోటీసులు
హైదరాబాద్: టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ (Navdeep) విచారణకు హాజరుకావాలని నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 23న విచారణకు హాజరుకావాలంటూ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు నార్కోటిక్ అధికారులు.
అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇటీవల జారీ చేసిన బెయిల్ రద్దవడంతో.. పోలీసులు నవదీప్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయించే రాంచందర్‌తో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై నార్కోటిక్ పోలీసులు ఆధారాలు సేకరించారు.

వాట్సాప్ చాటింగ్ తోపాటు కాల్ డేటాను సేకరించారు. దీని ఆధారంగా నవదీప్‌ను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.
కాగా, టాలీవుడ్ దర్శకుడి అరెస్టుతో మళ్లీ మొదలైన డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఇటీవల మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. నైజీరియన్లు ఆమోబీ, మైఖేల్, థామస్, సినీ దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఇండస్ట్రీతో సంబంధం ఉన్న రాంచందర్, దేవరకొండ సురేశ్ రావు, ఖమ్మం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సందీప్, శ్రీకర్ కృష్ణప్రణీత్‌లను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అరెస్ట్ చేసింది.
సురేశ్ రావు వద్ద 4 గ్రాముల డ్రగ్స్ దొరికింది. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిర్మాత ఉప్పలపాటి రవి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య, బిస్త్రా, టెర్రా కేఫ్ ఓనర్ అర్జున్, విశాఖపట్నం వాసి కలహర్ రెడ్డి, మరో ఐదుగురు డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న మరో ముగ్గురు నైజీరియన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సినీ నటుడు నదవీప్‌కు డ్రగ్స్ చేరేవని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications