సెలబ్రిటీల నిర్మాణాలపై గురి, నోటీసులు - దబిడి దిబిడే..!!

ఇప్పుడు సెలబ్రెటీలకు హైడ్రా టెన్షన్ మొదలైంది. హీరో నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత తరువాత హైడ్రా ఎవరి పైన గురి పెట్టిందనేది ఉత్కంఠ పెంచుతోంది. చెరువులను ఆక్రమించిన వారిని వదిలేని లేదని తాజాగా సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. కూల్చివేతలు ఉంటాయని స్పష్ట చేసారు. ఇదే సమయంలో హైడ్రా ఆక్రమణ దారులకు నోటీసులు ఇస్తోంది. ఇటు ప్రముఖులు నివసించే చిత్రపురి కాలనీలో నిబంధనల కు వ్యతిరేకంగా నిర్మించిన విల్లాలకు నోటీసులు జారీ చేసారు.

విల్లాలకు నోటీసులు
నిబంధనలు అతిక్రమించిన నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మణికొండ చిత్రపురి కాలినీలోని 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. జీవో నంబర్‌ 658కు విరుద్ధంగా విల్లాలను నిర్మించినట్లు గుర్తించారు. జీ+1 అనుమతులు తీసుకుని జీ+2 నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. గత పాలకవర్గం దొంగచాటున అనుమతులు పొందినట్లు తేల్చారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించారు.

Notices issues to Chitrapuri colony 225 Villas over Illegal Constructions

తేల్చేసిన సీఎం
చిత్రపురిలో జరిగిన అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ ఫిర్యాదులు రావడంతో మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులు జారీచేశారు. కాగా, సొసైటీ సభ్యులు అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా 7 విల్లాలను అక్రమంగా నిర్మిస్తున్నారు. గుర్తించిన హైడ్రా అధికారులు.. ఈ నెల 21న వాటిని నేలమట్టం చేశారు. గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వాటిలో తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా చెరువు స్థలాలలో కట్టుకున్నవి కావడంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఆక్రమిస్తే కూల్చివేతే
నగరం పరిధిలో చెరువులు దాదాపు 920 ఉన్నాయి. వీటిలో దాదాపు 500 చెరువులు కబ్జాకు గురయ్యాయి 200కు పైగా చెరువులలో అక్రమ నిర్మాణాలు చేయడం జరిగింది. అక్రమ నిర్మాణాలతో చెరువులలోకి వెళ్లాల్సిన వర్షపు నీరు వరద రూపంలో నడి రోడ్లను ముంచెత్తుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఎంత ఒత్తిడి వచ్చినా చెరువులను ఆక్రమించిన వారిని వదిలేది లేదని..ఇందులో రాజకీయ కక్ష లేదని తేల్చి చెప్పారు. ఎవరు ఎవరికి స్నేహితుడు అయినా కూల్చివేతలే ఉంటాయని స్పస్టం చేసారు. దీంతో, ఇప్పుడు ఆక్రమణలతో నిర్మాణాలు చేసిన సినీ - పొలిటికల్ సెలబ్రెటీల్లో టెన్షన్ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+