టీడీపీకి ఊరట!: గాలికి వదిలేశారని గవర్నర్‌పై కాంగ్రెస్ ఆగ్రహం

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ పైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తి పోస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన పైన భగ్గుమన్నారు. గవర్నర్ రాజ్యాంగ పరిరక్షణను గాలికి వదిలేశారని కాంగ్రెస్ నేత మల్లుభట్టి విక్రమార్క గురువారం మండిపడ్డారు.

ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో అసంబద్ధంగా వార్డులను విభజించారని విమర్శించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తమ పార్టీలో చేర్చుకుంటుందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణను గవర్నర్ గాలికి వదిలేశారన్నారు. అలాగే, జీహెచ్ఎంసీ అసంబద్ధ విభజన పైన సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్‌‍ను కలుస్తామన్నారు.

Now, Congress lashes out at Governor

తెరాస కుటుంబ పార్టీగా మారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో అన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగుచెందారన్నారు. టీడీపీ, తెరాస రెండు దొంగలే అన్నారు. రైతులను తెరాస పట్టించుకోవడం లేదన్నారు. సామాజిక న్యాయాన్ని తెరాస విస్మరిస్తోందన్నారు.

హడ్కో ఛైర్మన్ రవికాంత్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హడ్కో ఛైర్మన్ రవికాంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తాగునీటి పథకానికి రూ. 25 వేల కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతకుక్రింతం కేటీఆర్ కేంద్రమంత్రి వెంకయ్యానాయుడును కలిశారు. అనంతరం కేటీఆర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+