వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఎన్నారైలే తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక రాయబారులుగా ప్రవాసుల సేవలను వినియోగించుకుంటామని ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో ఏటా ప్రవాసుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రవాసుల దినోత్సవం నిర్వహణపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా ఒక రాష్ట్రంలో ప్రవాసుల దినోత్సవాన్ని జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ ఉత్సవాల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇందులో 30 వేలమందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు.

ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని, వారి ద్వారా సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక విశేషాలను విదేశాల్లోనూ చాటుతామని చెప్పారు. ప్రవాసుల ద్వారా తెలంగాణకు విదేశీ పర్యాటకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాన్ని చేపట్టామన్నారు.

ప్రవాసులు అక్కణ్నుంచి విదేశీయులను పంపితే వారికి అతిథి మర్యాదలు కల్పిస్తామని, రాయితీలిస్తామని చెప్పారు. ప్రవాసుల దినోత్సవం, పర్యాటక అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయా శాఖల అధికారులు తెలిపారు.

వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్‌ చిరంజీవులు, ఆర్టీసీ, పర్యాటక అభివృద్ధి సంస్థ, అమెరికా, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు, హోటళ్లు, రిసార్ట్స్‌ల నిర్వాహకులు పాల్గొన్నారు.

ప్రవాసులతో భేటీ

ప్రవాసులతో భేటీ

తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక రాయబారులుగా ప్రవాసుల సేవలను వినియోగించుకుంటామని ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో ఏటా ప్రవాసుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

ప్రవాసులతో భేటీ

ప్రవాసులతో భేటీ

బుధవారం హైదరాబాద్‌లో ప్రవాసుల దినోత్సవం నిర్వహణపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా ఒక రాష్ట్రంలో ప్రవాసుల దినోత్సవాన్ని జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందన్నారు.

ప్రవాసులతో భేటీ

ప్రవాసులతో భేటీ

హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ ఉత్సవాల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇందులో 30 వేలమందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు.

ప్రవాసులతో భేటీ

ప్రవాసులతో భేటీ

ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని, వారి ద్వారా సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక విశేషాలను విదేశాల్లోనూ చాటుతామని చెప్పారు. ప్రవాసుల ద్వారా తెలంగాణకు విదేశీ పర్యాటకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాన్ని చేపట్టామన్నారు.

English summary
The Telangana Tourism department is planning to introduce personalised and specialised tourism packages, in a bid to attract more foreign tourists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X