ఎన్ఎస్‌యూఐ సమావేశం రసాభాస: బల్లలు, కుర్చీలు విసిరేసుకున్న కార్యకర్తలు, మహిళా నేత ఆవేదన
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రషాభాసగా మారింది. హైదరాబాద్ గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రెండు వర్గాలు విడిపోయి బల్లలు, కుర్చీలు విసిరేసుకున్నారు.
మూడేళ్లుగా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కొంతమంది నాయకులు నిలదీశారు. దీంతో పలువురు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ఉపాధ్యక్షురాలు చందనారెడ్డి కూడా వాగ్వాదానికి దిగారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎలాంటి కమిటీలు నియమించకుండా వెంకట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చందనా రెడ్డి ఆరోపించారు. సమావేశంలో మాట్లాడుతుండగా వెంకట్ అనుచరులు అడ్డగించారని, తమ అభిప్రాయాలు చెబితే బెదిరిస్తున్నారని చందనా రెడ్డి మీడియా ముందు వాపోయారు. తమ సమస్యలు చెబుతుంటే కొందరు మీసాలు మెలేస్తున్నారని చందన మండిపడ్డారు.

ఖమ్మంకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. గురువారం ఖమ్మం వెళ్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నామన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం.. కార్యాచరణ ప్రకటిస్తాం అని జగ్గారెడ్డి తెలిపారు. ఖమ్మలో ఏం చేస్తాం అనేది చూపిస్తామన్న ఆయన.. తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఇక, తమ పర్యటనలో బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని కూడా పరామర్శిస్తామన్నారు జగ్గారెడ్డి. పార్టీ కార్యకర్త లాగా కాదు.. సాధారణ పౌరుడిగా పరామర్శ చేస్తామన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications