ప్రపంచ తెలుగు మహాసభలకు ఎన్టీఆర్ సెగ: గుండు గీయించుకుని నిరసన
Recommended Video

విజయవాడ: ప్రపంచ తెలుగు మహాసభలకు ఎన్టీఆర్ పేరుతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయకపోవడంపై దివంగత ఎన్టీ రామారావు అభిమానులు శుక్రవారం తమ నిరససను వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్వాగత ద్వారం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన అభిమానులు గరికపాడు దగ్గర గుండు గీయించుకుని నిరసనను తెలిపారు.

తెలుగుకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత కల్పించిన ఎన్టీ రామారావును ప్రపంచ తెలుగు మహాసభల్లో విస్మరించారని ఎన్టీఆర్ అభిమానులు విమర్శించారు.. కనీసం ఎన్టీఆర్ ఫోటోను కూడా ఎక్కడా లేకుండా చేశారని ఆరోపించారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానించలేదని సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు రాకపోవచ్చుననే ఉద్దేశంతో ఆహ్వానం పంపలేదని అంటున్నారు. అయితే వచ్చినా రాకున్నా ఆహ్వానం పంపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications