వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా కరోనా వైద్యసేవలు.. ప్రతిరోజు 1000 మందికి సాయం

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో బాధితులకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్టీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సేవల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకు తగినట్టుగా వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ ద్వారా కరోనా బాధితులకు వైద్య నిపుణులతో సూచనలు, సలహాలు అందించే కార్యక్రమాన్నిప్రారంభించారు.

క‌రోనా బాధితుల‌కు టెలిమెడిసిన్‌

క‌రోనా బాధితుల‌కు టెలిమెడిసిన్‌

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజుకు 1000 మంది కరోనా బాధితులకు ఆన్‌లైన్ ద్వారా నిపుణులతో వైద్య సలహాలు, సూచనలు అందించేందుకు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి లక్ష్యంగా నిర్దేశించారు. జూమ్ యాప్ ద్వారా ప్రతిరోజూ ఉదయం గం.7:30 ని.లకు ఈ టెలిమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. గురువారం 360 మంది కరోనా బాధితులకు వైద్య సలహాలు, మందులను అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.

ప్ర‌తి రోజు 1000 మందికి సాయం

ప్ర‌తి రోజు 1000 మందికి సాయం


ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డాక్టర్ లోకేశ్వరరావు గారు జూమ్ కాల్ ద్వారా కరోనా బాధితులతో మాట్లాడి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. రోగుల ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు ఆధారంగా వారికి మందులు సూచించారు. వివిధ పరీక్షలు చేయించుకోవాలని రోగులకు సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ వైద్య సేవలతో పాటు పలు చోట్ల రోగులకు మందులు పంపిణీ చేశారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రతి రోజుకు 1000 మందికి టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సాయం చేసేందుకు ఏర్పాట్లు చేసిన ట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.

 ఉదయం 7.30 గంటలకు టెలిమెడిసిన్‌ ప్రక్రియ ప్రారంభం

ఉదయం 7.30 గంటలకు టెలిమెడిసిన్‌ ప్రక్రియ ప్రారంభం


టీడీపీ పార్టీ వర్గాల ద్వారా జూమ్ కాన్పరెన్స్ లింక్ ను ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు టెలిమెడిసిన్‌ ప్రక్రియ ప్రారంభమౌతోందని తెలిపారు. అటు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలకు పలువురు తమ తోడ్పాటునందించేందుకు ముందుకు వస్తున్నారు. టీడీపీ వైద్య విభాగం అధ్యక్షుడు జెడీ శివప్రసాద్ సుమారు 5 వేల మందికి మందుల పంపిణికి ముందుకు వచ్చారు.

Recommended Video

NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
అద‌నంగా డాక్ట‌ర్ల నియామ‌కం

అద‌నంగా డాక్ట‌ర్ల నియామ‌కం

తొలి రోజు కరోనా బాధితులకు అందించిన సహాయంపై ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ భవనేశ్వరి సమీక్షించారు. టెలిమెడిసిన్ సేవలను మరింత మెరుగుగా అందించేందుకు అదనంగా వైద్య సిబ్బందిని నియమించ‌నున్న‌ట్లు తెలిపారు. త‌ద్వారా ఎక్కవ మంది రోగులకు సహాయం అందించేందుకు తోడ్ప‌డుతుంద‌ని భువనేశ్వరి పేర్కొన్నారు.

English summary
NTR Trust launch corona care for patients
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X