వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నీ మార్పిడి శ‌స్త్ర చికిత్స‌లో నిమ్స్ రికార్డ్.. మంత్రి హరీశ్ అభినంద‌న‌లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ వైద్యార్యోగాలకు పెద్ద‌పీట వేస్తోంద‌న్నారు వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు. పేద‌లకు ఆరోగ్య‌శ్రీ ద్వారా ఎన్నో ర‌కాల వైద్య సేవ‌లను అందిస్తున్న‌ట్లు తెలిపారు.బ‌డ్జెట్‌లో కూడా వైద్యానికి ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించిన‌ట్లు తెలిపారు. పెద్ద సంఖ్య‌లో ప్ర‌భుత్వాసుప‌త్రుల‌ను ఆధునీక‌రించామ‌ని చెప్పారు. రోగుల‌కు మెరుగైన వైద్యాన‌న్ని అందించేందుకు అధునాత‌న వైధ్య ప‌రిక‌రాల‌తో పాటు అవ‌స‌ర‌మైన వైద్య సిబ్బందిని నియ‌మించిన‌ట్లు తెలిపారు. కిడ్నీల మార్పిడి శ‌త్స‌చికిత్స‌లో నిమ్స్ వైద్యులు అరుదైన ఘ‌న‌త సాధించ‌డం ప‌ట్ల మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

వైద్య‌రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు

వైద్య‌రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని వైద్య‌రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులను సీఎం కేసీఆర్ తీసుకువ‌చ్చార‌ని మంత్రి హ‌రీశ్ పేర్కొన్నారు. వైద్య రంగానికి పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తోంద‌న్నారు. ఇప్పుడు ఆఫ‌లితాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.కేసీఆర్ ప్ర‌భుత్వం అవ‌య‌వ‌దానం వంటి కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హించ‌డంలో ముందు ఉంద‌న్నారు మంత్రి హ‌రీశ్ రావు.

హైద‌రాబాద్‌లోని నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ వంటి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో అవ‌య‌వ మార్పిడి చికిత్స‌ల‌కు అవ‌ర‌స‌ర‌మైన వైద్య స‌దుపాయాలు అందుబాటులో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు..ఈ ఆస్ప‌త్రుల్లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఐసీయూ. డ‌యాల‌సిస్‌, మాడ్యుల‌ర్ థియేట‌ర్స్ అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు.

ఆరోగ్య‌శ్రీ ద్వారా పేద‌ల‌కు ఉచితంగా వైద్యం

ఆరోగ్య‌శ్రీ ద్వారా పేద‌ల‌కు ఉచితంగా వైద్యం

ఈ అవయ‌వ మార్పిడి శ‌స్త్ర చికిత్స తెలంగాణ ప్ర‌భుత్వం ఆరోగ్య‌శ్రీ ద్వారా పేద‌ల‌కు ఉచితంగా చేస్తోంద‌ని చెప్పారు. వారికి అవ‌స‌ర‌మైన మందుల‌ను కూడా ఉచితంగానే అందిస్తోందని మంత్రి హ‌రీశ్ తెలిపారు. పేద‌ల‌కు ఉచితంగా వైద్యాన్ని అందించడంలో తెలంగాణ ముందు ఉంద‌ని పేర్కొన్నారు. కిడ్నీ శ‌స్త్ర చికిత్స‌లో నిమ్స్ ముందు ఉంద‌ని మంత్రి హ‌రీశ్ రావు అభినందించారు.

ఎంతో ఓర్పుతో, నేర్పుతో నిమ్స్ వైద్యులు, న‌ర్సులు, వైద్య సిబ్బంది ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. నిమ్స్ ఆస్ప‌త్రి అభివృద్ధికి ప్ర‌భుత్వం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. ఆస్ప‌త్రికి అవ‌స‌ర‌మైన మ‌రిన్ని మౌలిక స‌దుపాయాల‌తో పాటు అత్యాధునిక ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తెచ్చే దిశ‌గా చ‌ర్యలు ప్రారంభించిన‌ట్లు చెప్పారు.

రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శ‌స్త్ర చికిత్స‌లు

రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శ‌స్త్ర చికిత్స‌లు

హైదార‌బాద్‌లోని నిమ్స్ కిడ్నీల మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ల్లో రికార్డు సృష్టించింది. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత ఈ ఎనిమిదేళ్ల‌తో 742 ఆప‌రేష‌న్లు నిర్వ‌హించారు. అటు 2016 నుంచి ఈ ఆసుప‌త్రిలో ప్ర‌తి సంవ‌త్స‌రం వంద‌కుపైగా కిడ్నీల మార్పిడి ఆప‌రేష‌న్లు జ‌రిగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 25 ఏళ్ల‌లో కేవలం 649 ఆప‌రేష‌న్లు మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.

2016లో 111, 2017లో 114, 2018లో 111, 2019లో 107 కిడ్నీ ఆప‌రేష‌న్లు చేశారు. 2020 సంవ‌త్స‌రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ కిడ్నీ ఆప‌రేష‌న్లు త‌గ్గాయి. అయితే ఈ ఏడాది 100 ఆప‌రేషన్లు నిర్వ‌హించారు. 1989 నుంచి 2021 వ‌ర‌కు మొత్తం 1398 కిడ్నీ మార్పిడి శ‌స్త్ర చికిత్స‌లు నిర్వ‌హించిన‌ట్లు వైద్యులు తెలిపారు

కిడ్నీ మార్పిడికి జీవ‌న్‌ధాన్‌లో రిజిస్ట్రేష‌న్లు..

కిడ్నీ మార్పిడికి జీవ‌న్‌ధాన్‌లో రిజిస్ట్రేష‌న్లు..

ఈ ఏడాది 100 కిడ్నీ మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ల్లో 97 మందికి తెలంగాణ ప్ర‌భుత్వ‌మే ఉచితంగా చేసింది. ఈ 100 మందిలో 75 మంది పురుషులకు 25 మంది మహిళ‌ల‌కు కిడ్నీ మార్పిడి జ‌రిగింది. కిడ్నీల మార్పిడి స‌ర్జ‌రీల‌కు దాదాపు 10ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు అవుతంది. కాగా, 97 మందిలో 90 మందికి ఆరోగ్య‌శ్రీ ద్వారానే శ‌స్త్ర చికిత్స‌లు చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కాగా ఇంకా 7000 మందికి పైగా కిడ్నీ మార్పిడి కోసం జీవ‌న్‌ధాన్‌లో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు.

English summary
Number of kidney transplant surgeries recorded in Nims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X