వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రయాణికులకు శుభవార్త: ఆర్ఏసీ బెర్తుల పెంపు

రైలు ప్రయాణికులకు మరో తీపికబురునందించింది రైల్వేశాఖ. అన్ని రైళ్లలో ఆర్‌ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రైలు ప్రయాణికులకు మరో తీపికబురునందించింది రైల్వేశాఖ. అన్ని రైళ్లలో ఆర్‌ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించింది. జనవరి 17 నుంచి అన్ని రైళ్లలో అదనపు ఆర్‌ఏసీ కోటాను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.

ఆర్‌ఏసీ విభాగంలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో స్లీపర్‌ కోచ్‌లో ఐదు సైడ్‌లోయర్‌ బెర్తుల్లో పది మందికి, మూడో తరగతి ఏసీ కోచ్‌లో రెండు సైడ్‌ లోయర్‌ బెర్తుల్లో న‌లుగురిని, రెండో తరగతి ఏసీ కోచ్‌లో లోయర్‌ బెర్తులో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించేవారు.

Number of RAC berths in all trains to go up: Indian Railway

తాజాగా ఆ సంఖ్యను పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. స్లీపర్‌ కోచ్‌, మూడో తరగతి ఏసీలో మరో రెండు లోయర్‌ బెర్తుల్లో ఆర్‌ఏసీ ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. రెండో తరగతి ఏసీలో మరో లోయర్‌ బెర్తును ఆర్‌ఏసీ విభాగంలోకి చేర్చింది. ప్రస్తుత నిర్ణయంతో ప్రయాణికులకు అదనంగా ప్రయోజనం దక్కనుంది.

ఆర్ఏసీ టికెట్‌దారునికి సీటు ఖరారైనా రాత్రి పడుకునేందుకు అవసరమైన బెర్తు నిరీక్షణ జాబితాలో ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ కొనుగోలుదారు సమయానికి రైలు ఎక్కకపోయినా, రద్దు చేసుకున్నా వారి బెర్తును ఆర్ఏసీ టికెట్ కొనుగోలుదారులకు కేటాయిస్తారు. ఇద్దరికి ఆర్ఏసీ టికెట్లుంటే బెర్తును రెండు సీట్లుగా విభజిస్తారు.

English summary
To accommodate more passengers, Railways has decided to increase reservation against cancellation (RAC) berths in all trains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X