ధన్ కీ బాత్ కాదంటూ కేంద్రంపై కేసీఆర్ ఫైర్: బీఆర్ఎస్‌లోకి మాజీ సీఎం గమాంగ్, కీలక నేతలు

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, సహా పలువురు ఒడిశా సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

హైదరాబాద్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, సహా పలువురు ఒడిశా సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో గిరిధర్‌కు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్‌ ఒడిశా నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్‌, లక్ష్మీపూర్‌ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు.

బీఆర్ఎస్‌లోకి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్: కేసీఆర్ ఆహ్వానం

బీఆర్ఎస్‌లోకి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్: కేసీఆర్ ఆహ్వానం

ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తోపాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో హేమ గమాంగ్, జయరాం పాంగీ, రామచంద్ర హన్ష్‌దా, బృందావన్ మజ్హీ, నబీన్ నంద, రాథా దాస్, భగీరథి సేతి, మయాదర్ జేనా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఒడిశా నుంచి సుదూరం ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలకు అభినందనలు తెలిపారు. దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ప్రతి ఇంటికీ తాగునీళ్లు ఇవ్వలేకపోతున్నామన్నారు. జాతి, ధర్మం పేరుతో ఓట్లు అడిగి ఏం చేస్తారని అన్నారు.

ఒడిశాలో ప్రజలకు తాగునీరే అందడం లేదన్న కేసీఆర్

ఒడిశాలో ప్రజలకు తాగునీరే అందడం లేదన్న కేసీఆర్

అమెరికా, చైనా కంటే మన దేశంలోనే సంపద ఎక్కువగా ఉందని.. కానీ, మన దేశం వాటితో పోల్చుకుంటే ఎక్కడ ఉన్నామని కేసీఆర్ ప్రశ్నించారు.
ఒడిశాలో మహానది, బ్రాహ్మణి లాంటి నదులు ఎన్నో ఉన్నా.. తాగునీరు అందరికీ ఇవ్వలేకపోతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈ నదుల్లోని నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఆ నీటిని సక్రమంగా ఉపయోగిస్తే.. ఒడిశాలో ప్రజలందరికీ తాగునీరు అందించవచ్చన్నారు. అలాగే సాగునీరు కూడా లభిస్తుందన్నారు. దేశంలో రైతుల ఆందోళనలు జరుగతున్నాయన్నారు. ఉద్యోగాలు లేవని.. మాటలే ఉన్నాయని కేంద్రంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కారంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

అబ్ కీ బార్ కిసాన్ సర్కారంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అంటూ కేసీఆర్ నినదించారు. నాగళ్లు పట్టే రైతులు.. కలం పట్టుకోవాలన్నారు. చట్ట సభల్లోనూ రైతులు రావాలన్నారు. తెలంగాణలో గతంలో ఎన్నో సమస్యలు ఉండేవని.. ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించామని చెప్పారు. 24 గంటల విద్యుత్, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఒడిశా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో సంపద ఎక్కువ ఉన్నప్పటికీ.. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని నిలదీశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో జరగాల్సిన అవసరం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ధన్ కీ బాత్ కాదంటూ కేంద్రంపై కేసీఆర్ ఫైర్

ధన్ కీ బాత్ కాదు.. మన్ కీ బాత్ కావాలన్నారు కేసీఆర్. దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్ అని చెప్పారు. చివరకు మనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కొందరు తమను మజాక్ చేస్తారని.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పేదల కోసమే పనిచేస్తున్నామన్నారు. మన దగ్గర సంపద ఉందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమెరికాను అడగాల్సిన అవసరం లేదన్నారు. నష్టాలను ప్రజలకు పంచి.. లాభాలను ప్రైవేటైజేషన్ చేస్తున్నారని కేంద్రంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
అన్ని ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు.
అంబానీ, టాటా, బిర్లాలకు మద్దతు ఇస్తున్నారన్నారు. దేశాన్ని కాపాడాలని కేసీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ విజయం ఖాయమంటూ కేసీఆర్ హామీలు

బీఆర్ఎస్ కు మద్దతుగా చాలా రాష్ట్రాల నుంచి నేతలు ఫోన్లు చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ఒడిశా మాజీ సీఎం గమాంగ్ చాలా పెద్ద నాయకుడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మనకు విజయం లభిస్తుందన్నారు. మహాన్ భారత్ నిర్మాణం చేస్తామన్నారు. పేదల కోసం ఆలోచిస్తాం కాబట్టే మన పార్టీ గెలుస్తుందని చెప్పారు. దేశంలో ఆదివాసీలు, దళితుల పరిస్థితి బాగోలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే అంబేద్కర్ సిద్ధాంతాలు అమలు చేసినట్లయితే వారి పరిస్థితి బాగుండేదన్నారు. తెలంగాణలో దళితులకు దళితబంధు పేరుతో రూ. 10 లక్షలు ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా దళితబంధు అమలు చేస్తామన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తామన్నారు. కిసాన్ బంధును దేశంలో అమలు చేస్తామన్నారు. ప్రపంచంలో చైనా, అమెరికా దేశాల కంటే మనదేశంలోనే వ్యవసాయ అనుకూలమైన భూమి ఎక్కువగా ఉందని అన్నారు కేసీఆర్. అయినా రైతుల కళ్లల్లో నీరు ఎందుకు అని ప్రశ్నించారు. ఇప్పుడు చైనా కంటే మనదేశంలోనే జనాభా ఉందని చెప్పారు. మానవవనరులను ఉపయోగించుకోవాలన్నారు. పోరాటం చేయాల్సిందేనని చెప్పారు. వజ్ర సంకల్పంతో సుహాన్ భారత్.. మహాన్ భారత్ నిర్మాణమే బీఆర్ఎస్ స్వప్నమని కేసీఆర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+