ఇక నుంచి అధికారికంగా సదర్ వేడుకలు: చిందేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఇక అధికారికంగా సదర్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సదర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పామన్న రేవంత్.. మాటిచ్చినట్లుగానే ఇక నుంచి సదర్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. జ్యోతి ప్రజ్వలన చేసి సదర్ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పశువులను పూజించడం యాదవుల ప్రత్యేకత అని అన్నారు. రాష్ట్రంలోని యాదవులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. యాదవ సోదరులు అవకాశాలు అందిపుచ్చుకోండని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం ఉంటుందని సీఎం రేవంత్ చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని మూసీ పునర్జీవన కార్యక్రమంలో యాదవులు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మూసీ పుర్జీవన ప్రాజెక్టును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
ముషీరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ గెలిస్తే.. ఆయన మంత్రి అయ్యేవారని సీఎం రేవంత్ తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ ఓడిపోయినప్పటికీ.. ఆయన కుటుంబానికి తగిన ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ అనిల్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Chief Minister Revanth Reddy at the Sadar Sammelan - held at NTR stadium.#revanthreddy#Sadar#sadarfestival pic.twitter.com/ZA1lph8UIo
— M A Mohsin (@mohdamohsin) October 27, 2024
ఇది ఇలావుండగా, కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చిందేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కోరిక మేరకు సీఎం రేవంత్ స్పెప్పులేశారు.












Click it and Unblock the Notifications