• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో కూర‌గాయ‌లు..! దూసుకుపోతున్న ధ‌ర‌లు..! బెంబేలెత్తుతున్న వినియోగ‌దారులు..!!

|

హైద్రాబాద్: నగర వాసులకు కూర‌గాయ‌లు బాంబుల్లా కన్పిస్తున్నాయి. వర్షాభావ కారంగా పంట దెబ్బతినడంతో కూగాయ ధ‌ర‌లు ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి.ఉల్లిలేని కూర, టమాట లేని చారును ప్రజలు ఊహించడం కష్టమే. అందుకే వాటి వినియోగం భారీ స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో వాటి ధరలు కూడా కొండెక్కుతున్నాయి. వీటిని తినాలనే కోరిక ఉన్నా ధర చూసి జనం ఝడుసుకుంటున్నారు. నోరు కట్టేసుకుని పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు.మోతమోగిస్తున్న కూర‌గాయ‌ల‌ ధరలపై వ‌న్ ండియా ప్రత్యేక కథనం..

రోజు రోజుకూ పెరుగుతున్న కూర‌గాయ‌ల రేట్లు..! షాక్ కు గురౌతున్న వినియోగ‌దారుడు..!!

రోజు రోజుకూ పెరుగుతున్న కూర‌గాయ‌ల రేట్లు..! షాక్ కు గురౌతున్న వినియోగ‌దారుడు..!!

రోజు రోజుకి కూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయ కొనలాన్న ధరల ఘాటు భగ్గుమంటోంది. సామాన్యుడు ఏ కూర కొనాలన్న ఆలోచించాల్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నా మొన్న మామూలు ధరలో ఉన్న కూరగాయలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకున్నాయి. బీన్స్‌ ధరలు చుక్కలనంటాయి. తానేమీ తీసిపోలేదని ట‌మాటో ధరలు కూడా కొండెక్కాయి. అల్లం ఘాటెక్కింది. నగరంలోని 13 రైతు బజార్లలో ఈ వారం కూరగాయల ధరలు పెరిగాయి. కొన్నింటి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

గాయ‌పరుస్తున్న కూర‌గాయ‌ల ధ‌ర‌లు..! ఇబ్బందుల్లో వినియోగ దారులు..!!

గాయ‌పరుస్తున్న కూర‌గాయ‌ల ధ‌ర‌లు..! ఇబ్బందుల్లో వినియోగ దారులు..!!

ముఖ్యంగా బీన్స్‌ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత వారం కిలో 60 రూపాయ‌లుగా ఉన్న బీన్స్‌ ధర ఈ వారం 74రూపాయ‌ల కి చేరింది. పొటల్స్‌ ధరలు 40 నుంచి 62 రూపాయ‌ల‌కి పెరిగాయి. అల్లం 82 నుంచి 84రూపాయ‌ల‌కు, బీరకాయలు 36 నుంచి 38 రూపాయ‌ల‌కు, కాకరకాయలు 30 నుంచి 36రూపాయ‌ల‌కు, ఆగాకర కాయలు 50 నుంచి 60రూపాయ‌ల‌కు, బీట్‌ రూట్‌ 20 నుంచి 22కి, టమాటా 14 నుంచి 16కి, చిక్కుడు కాయలు 28 నుంచి 32కి, దేవుడు చి��్కుడు 24 నుంచి 32కి, క్యాప్సికం 42 నుంచి 44కి, బరబాటి 22 నుంచి 24కి, ముల్లంగి 16 నుంచి 18రూపాయ‌ల‌కు పెరిగాయి.

అవాక్క‌వుతున్న వినియోగ దారుడు..! య‌దేచ్చ‌గా మ‌ద్య‌వ‌ర్తుల దందా..!!

అవాక్క‌వుతున్న వినియోగ దారుడు..! య‌దేచ్చ‌గా మ‌ద్య‌వ‌ర్తుల దందా..!!

ధరలు తగ్గిన వాటిలో ఉల్లిపాయలు 13 నుంచి 12రూపాయ‌ల‌కి, చేమ దుంపలు 26 నుంచి 24కి, మిర్చి తెలుపు 26 నుంచి 24కి, మిర్చి నలుపు 26కి, దొండకాయలు 26 నుంచి 24కి, కంద 28 నుంచి 24కి తగ్గాయి. ధరల్లో ఎటువంటి మార్పు లేని వాటిలో బెండకాయలు ఉన్నాయి. వీటి దర 34, తెల్ల వంకాయలు 22, నల్ల వంకాయలు 32రూపాయ‌లు, క్యాబేజీ 14రూపాయ‌లు, క్యారెట్ 24రూపాయ‌లు, గోరుచిక్కుడు 24, కర్రపెండలం 16, కాలీప్లవర్‌ 20, ఆనపకాయ 10రూపాయ‌లు, పచ్చి బఠాణి 36, బీన్స్‌ పిక్కలు 40, వెల్లుల్లి 46రూపాయ‌లుగా ఉన్నాయి. ఇక కోడి గుడ్లు, చికెన్ ధ‌ర‌ల గ‌రించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

నిద్రావ‌���్థ‌లో పౌర‌స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌..! ధ‌ర‌ల‌ను నియంత్రించాలంటున్న వినియోగ‌దారులు..!!

నిద్రావ‌���్థ‌లో పౌర‌స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌..! ధ‌ర‌ల‌ను నియంత్రించాలంటున్న వినియోగ‌దారులు..!!

నిత్యావసరాల సరుకులతో పాటు కూర‌గాయ‌లు కొనాలంటేనే బెంబేలెత్తి పోవాల్సొస్తుందని వినియొగదారులు వాపోతున్నారు.ధరలు ఇంతగా మండిపోతుంటే వాటిని పండించిన రైతుకు లాభాలు వచ్చి పడుతున్నాయా అంటే అదీ లేదు. కూరగాయలు పండించి రైతు బజార్లకు, హోల్‌సెల్‌ మార్కెట్‌కు తెచ్చిన రైతుకు అక్కడి వ్యాపారులు చె��్పే రేటు వినగానే గుండే గుభేల్‌ మంటోంది. దళారుల మయాజాలంతో అన్నదాత కుదేలవుతుండగా కూరగాయలు కొనలేక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నట్టుండి ధరలు పెరగటంతోపేద, మధ్యతరగతి ప్రజలు అవాక్కైపోతున్నారు. కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వం రైతుబజార్లలో దళారుల దోపిడి దందాకు చెక్ పెట్టి పౌర సరఫరా వ్యవస్తను సాఫీగా చూడాల్సిన అవసరం ఉందనే అభిప��రాయం ప‌లువురు వినియోగ‌దారుల నుంచి వ్యక్తం అవుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Poor and middle class people are struggling to buy vegetables. Poor and middle class people are getting worried because of the rising prices. When the price of vegetable is not available to the public, the government needs to look into the civilian supply system by checking the exploitation of the beneficiaries in the farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more