వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

75ఏళ్ళ స్వాతంత్ర్య వేడుకల వేళ.. మహాత్ముడి ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులు.. ఎక్కడో తెలుసా!!

|
Google Oneindia TeluguNews

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఈ తరుణంలో మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకు రావడానికి చేసిన త్యాగాలను ప్రజలు స్మరించుకుంటున్నారు. అయితే తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని చిట్యాల పట్టణానికి సమీపంలోని పెద్దకాపర్తి గ్రామంలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన, జాతిపిత మహాత్మాగాంధీ ఆలయానికి పాదచారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య సుమాలు విరబూసిన వేళ గ్రామస్థులు ఆయన 'దర్శనం' కోసం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

తెలంగాణాలోని మహాత్ముడి ఆలయానికి పెరుగుతున్న రద్దీ

తెలంగాణాలోని మహాత్ముడి ఆలయానికి పెరుగుతున్న రద్దీ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నేపథ్యంలో తెలంగాణలోని చిట్యాల్ పట్టణం చుట్టుపక్కల ఉన్న చాలా మంది హైదరాబాద్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాత్మా గాంధీ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఇంటింటా జాతీయ జెండాలు రెపరెపలాడుతున్న ప్రజల్లో దేశభక్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

అంతేకాదు దేశ స్వాతంత్య్రాన్ని సాధించడం కోసం కష్ట పడిన మహనీయులను స్మరించుకుంటూ ఉన్న తరుణంలో నల్గొండ జిల్లాలోని పెద్దకాపర్తి గ్రామంలో నిర్మించిన మొట్టమొదటి మహాత్మా గాంధీ గుడికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారిని కూడా మహాత్ముడి గుడి ఆకర్షిస్తుందని మందిరాన్ని నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పివి కృష్ణారావు చెప్పారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భక్తులు ఎలా వస్తున్నారంటే

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భక్తులు ఎలా వస్తున్నారంటే

మహాత్మాగాంధీ ఆలయానికి సాధారణంగా ప్రతిరోజు 60-70 మంది సందర్శకులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆలయానికి ప్రతిరోజు సుమారు 350 మంది భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మహాత్ముని గుడికి రద్దీ పెరుగుతున్న పరిస్థితి ఉందని మహాత్మా గాంధీ జర డబుల్ ట్రస్ట్ కార్యదర్శి పి వి కృష్ణారావు వెల్లడించారు. 2014లో నిర్మించిన ఈ ఆలయంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు పెద్దగా నిర్వహించడం లేదు. కానీ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్-విజయవాడ హైవేకి సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో మహాత్ముడి ఆలయం

హైదరాబాద్-విజయవాడ హైవేకి సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో మహాత్ముడి ఆలయం


మహాత్ముని ఆలయానికి ప్రజలు క్రమం తప్పకుండా వచ్చి వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేయడంతో ఆలయం నెమ్మదిగా ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఆయన అన్నారు. సత్యం, శాంతి, అహింస మార్గాలను అనుసరించిన మహాత్ముని మార్గాన్ని అనుసరిస్తే ప్రతి ఒక్కరి లోనూ మార్పు వస్తుందన్న ఆలోచనతో ఈ ఆలయాన్ని నిర్మించారు. హైదరాబాద్-విజయవాడ హైవేకి సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మహాత్ముడు కూర్చున్న భంగిమలో ప్రజలకు కనిపిస్తారు. తన వద్దకు వచ్చే దేశ పౌరులందరికీ ఆయన ఆశీస్సులు అందజేస్తున్నారు.

సమీప గ్రామాలలో పెళ్లి చేసుకునే జంటలకు పట్టు వస్త్రాలు అందిస్తున్న చారిటబుల్ ట్రస్ట్

సమీప గ్రామాలలో పెళ్లి చేసుకునే జంటలకు పట్టు వస్త్రాలు అందిస్తున్న చారిటబుల్ ట్రస్ట్

మహాత్మా గాంధీ ఆలయ ట్రస్ట్ చిట్యాల్ సమీపంలోని గ్రామాలలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే, పెళ్లి రోజున జంటలకు పట్టు వస్త్రాలను అందించడం ప్రారంభించింది. గ్రామస్థులు వివాహ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసే ముందు పూజలు చేసి బాపు ఆశీస్సులు తీసుకోవడం కొత్త సంప్రదాయంగా మారిందని తెలిపారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాలను ఉద్దేశించి, తాము గాంధీజీని కేవలం స్వాతంత్ర ఉద్యమ పోరాటానికి మాత్రమే పరిమితం చేయాలని భావించడం లేదని పేర్కొన్నారు.

Recommended Video

అవినీతి,బంధుప్రీతి పట్ల కఠినవైఖరి చూపిస్తా... మోడీ *National | Telugu OneIndia
గాంధీజీ మహాత్ముడు మాత్రమే కాదు మహిమాత్ముడు ..

గాంధీజీ మహాత్ముడు మాత్రమే కాదు మహిమాత్ముడు ..

తాము గాంధీజీని మహాత్ముడిగా కాకుండా, మహితాత్ముడు గా అంటే దైవత్వం ఉన్న వ్యక్తిగా చూస్తామని ట్రస్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ పర్యాటక శాఖ కూడా ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేర్చిందని, రాష్ట్రంలోని ప్రముఖ స్థానాల్లో ఒకటిగా గుర్తిస్తోంది అని చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో మద్యాన్ని, మాంసాహారాన్ని నిషేధించారు.

కులాంతర వివాహాలను చేసుకునే వారి కోసం నామమాత్రపు ధరతో ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపాన్ని అందిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో తెలంగాణలోని మహాత్ముని ఆలయాన్ని దర్శించి, ఆయన ఆశీస్సులు పొందడం ఎంతో భాగ్యమని ఆలయానికి వస్తున్న వారు చెబుతున్నారు.

English summary
During the 75 years of independence celebrations, devotees are going on a pilgrimage to Mahatma's temple. The Mahatma Gandhi temple at Peddakaparthi village near Chityal town in Telangana's Nalgonda district is witnessing an increase in the number of devotees..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X