రేవంత్ కు అగ్నిపరీక్ష.!సొంత పార్టీలో ఒకరి తర్వాత ఒకరి వ్యతిరేక గళం.!ఉత్తమ్ అసంతృప్తి సెగలు.!

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏఐసీసీ దూతలుగా తెలంగాణ రాజకీయా వ్యవహారాల ఇంఛార్జులు మారతున్నప్పటికీ టీపిసిసి నేతల్లో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. తెలంగాణ పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి అంశంలో మొదటినుండీ అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి.కొంత కాలం సర్ధుమణిగినట్టు కనిపించినా ఉన్నట్టుండి భగ్గుమన్నట్టు అసంతృప్తి గళాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ పరంపర తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన మరుసటి రోజునుండీ కొనసాగుతున్నాయి.

రేవంత్ రెడ్డి దూకుడు యవ్వారం.: రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నాయకులు రేవంత్ రెడ్డి సారథ్యాన్ని వ్యతిరేకించారు.

revanthreddy-

తర్వాత రేవంత్ రెడ్డి తో పొసగలేక కొంత మంది నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇంకొత మంది పార్టీలోనే కొనసాగుతున్నారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డిని మొదటి నుండి విమర్శిస్తున్నప్పటి కొన్ని సందర్బాల్లో రాజీ పడి పార్టీలో కొనసాగుతున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేక గళం: ప్రధానంగా రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని,అందుకు సంబందించిన సమాచారాన్ని కూడా తక్షణమే మీడియాకు వివరిస్తారని, మీడియాలో చూసిన తర్వాత ఖంగుతినాల్సి వస్తుందనేది రేవంత్ రెడ్డి మీద ఇతర నేతల కీలక ఆరోపణలు.

సమిష్టి నిర్ణయాలు తీసుకుని మీడియాకు వివరాలు వెళ్లడిస్తే అమోదయోగ్యంగా ఉంటుంది గానీ, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని మీడియాకు వివరిస్తే స్ధానిక పార్టీ శ్రేణులను ఎలా ఒప్పించుకోగలుతామనేది కూడా వారు సంధిస్తున్న ప్రశ్న.

నల్లగొండలో 21న నిరసన సభ: తాజాగా నల్లగొండ జిల్లాలో ఈ నెల 21న విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని, ఈ సభను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి జిల్లా నాయకత్వానికి పిలుపునివ్వడంతో అదే జిల్లాకు చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాక్కయ్యారు.

విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ గురించి తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని ఎలా రూపొందిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై రేవంత్ రెడ్డి మీద అదిష్టానానికి ఫిర్యాదు చేయసేందుకు సైతం ఉత్తమ్ కార్యాచరణ రూపొందస్తున్నట్టు తెలుస్తోంది.

uttamrevanth

కొనసాగుతున్న విభాదాల పరంపర: ఇటీవల ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక పార్టీ మారినట్టు ప్రకటించారు. గతంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీ నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న కొద్ది మంది నేతలు కూడా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని విమర్శిస్తున్నారు.

నిన్నగాక మొన్న సంగారెడ్డిలో ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ను ఆహ్వానించారు గానీ పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆహ్వానించలేదు. దీంతో వారిరువురి మద్య విభేదాలు మరొక్కసారి బహిరంగమయ్యాయి. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద ఎగరేస్తున్న తిరుగు బావుటా టీపిసిసిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+