ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో..! ఒక్క స్థానం..! ఓకే పార్టీ నుంచి 29 మంది అభ్య‌ర్థులా..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణ రాజ‌కీయాలు కీలక మ‌లుపులు తిర‌గ‌డ‌మే కాదు మ‌ర్చిపోలేని సంఘ‌ట‌న‌ల‌ను కూడా నెల‌కొల్ప‌బోతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు చంద్ర‌శేఖ‌ర్ రావు ఏ ముహూర్తంలో పిలుపునిచ్చారో గాని చిత్రి విచిత్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాత ప‌ది జిల్లాల ప్ర‌కారం ఒక్కొక్క జిల్లాలో ఒకే పార్టీకి సంబందించి కీల‌క మ‌లుపులు తిరుగుతున్నాయి.

అంతే కాకుండా రాజ‌కీయంగా కొత్త స్నేహాలు కూడా చిగురిస్తున్నాయి. అప్ప‌టివ‌ర‌కు క‌లిసి మెలిసి ఉన్న వారిలో ఎన్నిక‌లు అన‌గానే తీవ్ర పోటీ నెల‌కొంటోంది. ఏ విష‌యంలోనైనా రాజీ ప‌డ‌తానేమో గాని పోటీ చేసే నియోజ‌క వ‌ర్గం లో మాత్రం ఎట్టి ప‌రిస్థితిలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పుకొస్తున్నారు. తాజాగా ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ నాయ‌కుల మ‌ద్య ఇలాంటి విచిత్ర‌క‌రైన పోటీ నెల‌కొంది. అదేంటో చూద్దాం..!!

 వేదెక్కుతున్న తెలంగాణ రాజ‌కీయం..! ఆశావ‌హుల్లో పెరుగుతున్న ఉత్కంఠ‌..!!

వేదెక్కుతున్న తెలంగాణ రాజ‌కీయం..! ఆశావ‌హుల్లో పెరుగుతున్న ఉత్కంఠ‌..!!

తెలంగాణలో రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ పెద్ద యెత్తున హడావిడి చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలూ ముందస్తుగానే ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. పొత్తులు, టికెట్లు ఖరారు కానీ స్థానాల్లోను ఆశావహులు ప్రచారం కోసం సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పాటు బీఎల్‌ఎఫ్ కూడా జిల్లాలోని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం విధితమే.

ప్ర‌చారంలో దూసుకెళ్తున్న అదికార పార్టీ..! మ‌షాలా సిద్దం చేసుకుంటున్న కాంగ్రెస్..!!

ప్ర‌చారంలో దూసుకెళ్తున్న అదికార పార్టీ..! మ‌షాలా సిద్దం చేసుకుంటున్న కాంగ్రెస్..!!

అధికారికంగా ప్రకటించిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటికే జోరుగా ప్రచారాన్ని చేపడుతున్నారు. అయితే, పలు నియోజవర్గాల్లో అన్ని పార్టీలకు చెందిన ఆశావహులు టికెట్‌ తమకే వస్తుందన్న ధీమాతో ప్రచార రథాలను, జెండాలను, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు పార్టీల అధిష్ఠానాలు సీట్ల కేటాయింపుపై చర్చలు జరుపుతున్నాయి.

కొలిక్కిరాని సీట్ల స‌ర్ధుబాటు..! మ‌హాకూట‌మిలో కొన‌సాగుతున్న స‌స్పెన్స్..!!

కొలిక్కిరాని సీట్ల స‌ర్ధుబాటు..! మ‌హాకూట‌మిలో కొన‌సాగుతున్న స‌స్పెన్స్..!!

ఈ కూటమిలో కీల‌క‌ పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పొత్తుల విషయంలో ఏయే నియోజకవర్గాలను ఏ పార్టీకి కేటాయించాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కొద్దిరోజుల కిందట టికెట్ కావాల్సిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించిందట కాంగ్రెస్ అధిష్ఠానం. రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి కొన్ని వందల సంఖ్యలో దరఖాస్తు వచ్చాయట. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో 29 మంది దరఖాస్తులు పంపించారని సమాచారం.

 ఇల్లందులో విచిత్ర పిర‌స్థితి..! ఒకే స్థానం కోసం కాంగ్రెస్ నుండి 29 మంది అభ్య‌ర్థులు..!!

ఇల్లందులో విచిత్ర పిర‌స్థితి..! ఒకే స్థానం కోసం కాంగ్రెస్ నుండి 29 మంది అభ్య‌ర్థులు..!!

వీరంతా కాంగ్రెస్ అభ్యర్ధిత్వం కోసం ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ వెళ్తున్నారని తెలుస్తోంది. రికార్డు స్థాయిలో ఇన్ని దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఈ సర్వే నివేదికల ఆధారంగా కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సభ్యులు నలుగురు పేర్లను హస్తినకు పంపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాలి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కోరం కనకయ్య విజయం సాధించి, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు.

English summary
In Telangana politics is going to be hot. As political parties are getting close to the polls, all political parties are spending huge hardships. In the face of the early election, all parties have begun propaganda campaign in advance. The alliances and tickets are finalized, but the aspirations of the seats are being prepared for the campaign. The BLF along with the authority TRS is also a matter of declaring candidates for various constituencies in the district. it is wonder ti listen that A total of 29 applications have been sent to party office for one constituency in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X