ఓటు వేస్తూ వీడియో.. వాట్సాప్‌లో వైరల్.. అడ్డంగా బుక్కయ్యాడా?
భద్రాద్రి : ఎన్నికల వేళ నిబంధనలు పక్కాగా అమలవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ మేరకు ఆయా రాష్ట్రాల యంత్రాంగాలు పనిచేస్తుంటాయి. పోలింగ్ సమయంలో ఓటింగ్ కేంద్రాల దగ్గర ఆంక్షలుంటాయి. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్నిరకాల చర్యలు తీసుకుంటారు. అయితే ఓటింగ్ విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. ఓటు వేస్తున్న దృశ్యాలు చిత్రీకరించడం, షేర్ చేయడం కూడా నిషేధమే.
తాజాగా పరిషత్ ఎన్నికల నేపథ్యాన.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బూర్గం పహాడ్ జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక ఓటర్ తాను ఎవరికి ఓటు వేస్తున్నాడో తెలిసేలా వీడియో తీశాడు. ఒక పార్టీ గుర్తుపై ఓటు వేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎవరికి ఓటు వేస్తున్నామనేది బయటకు చెప్పకూడదు. ఇక ఓటు వేసేటప్పుడు ఫోటోలు, వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. కానీ బూర్గం పహాడ్ జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఓటేస్తూ వీడియో తీయడం చర్చానీయాంశమైంది. అయితే సదరు వ్యక్తిపై ఈసీ చర్యలు తీసుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications