బంధువు పనే: ఏడాది చిన్నారిపై లైంగిక దాడి
సికింద్రాబాదులోని చిలుకలగూడలో దారుణమైన సంఘటన జరిగింది. తల్లిపక్కన నిద్రిస్తున్న ఏడాది చిన్నారిపై అర్ధరాత్రి సమయంలో బంధువు అత్యాచారం చేశాడు. కేసుకు సంబంధించిన వివరాలను మహంకాళి ఏసీపీ ఎస్.గంగాధర్ బుధవారం వివరించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పిల్లలతో పాటు దంపతులు నిద్రిస్తుండగా దీప్‌సింగ్ చడిచప్పుడు కాకుండా ఒకటిన్నర ఏళ్ల వయస్సుగల చిన్నారిని బాత్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. తిరిగి పాపను తల్లితండ్రుల వద్ద వదిలి నిద్రపోయాడు. బాధను తట్టుకోలేక పాప ఏడుస్తుండగా తల్లితండ్రులు నిద్రలేచి పాపను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అత్యాచారం జరిగిందని నిర్ధారించారు.












Click it and Unblock the Notifications