హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: యజమానితోపాటు సెక్స్ వర్కర్లు, విటుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వెబ్‌సైట్లలో సెక్స్ వర్కర్ల వివరాలను పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. కస్టమర్లు వారి వివరాలు తెలపగానే, వారిని సంప్రదించి వారి వద్దకు సెక్స్ వర్కర్లను పంపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో కుషాయిగూడలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి, నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఓ మహిళను కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన నీరజ్ కుమార్, రాకేష్ కొద్ది నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్నారు.

ఆ తర్వాత హైటెక్ గర్ల్స్.ఓఆర్‌జి అనే వెబ్‌సైట్ యువతుల ఫొటోలను అప్‌లోడ్ చేసేవారు. సైట్‌ను చూసి వారిని సంప్రదించిన కస్టమర్లకు యువతలను పంపేవారు. ఇద్దరు యువతులను ఒక్కరాత్రి పంపితే రూ. 25వేలు ఇవ్వాల్సి ఉంటుందని కస్టమర్లతో ఒప్పందం కుదుర్చుకుంటారు.

అయితే, కస్టమర్లు వారి వద్దకు వచ్చిన తర్వాతే యువతులను వారి వెంట పంపిస్తారు. ఈ ఇద్దరిలో ఒకరు ఆఫీసు కార్యకలాపాలు నిర్వహిస్తుంటే మరొకరు కస్టమర్లకు యువతులను పంపే పనిని చూస్తాడు. యువతులను క్యాబ్‌లలోనే పంపిస్తారు.

Online Hyderabad sex racket busted

ఇద్దరు యువతులను వెంట తీసుకుని ఉప్పల్ గుండా నీరజ్ ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నట్లు మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ సురేందర్ గౌడ్ తెలిపారు. నీరజ్‌ను కస్టడీకి తరలించి, ఇద్దరు యువతులను రెస్కూ హోంకి పంపినట్లు ఆయన చెప్పారు.

ఆ ఇద్దరు యువతుల్లో ఒకరిది ఢిల్లీ కాగా, మరొకరిది కాశ్మీర్ అని తెలిపారు. మరో నిందితుడు రాకేష్ దొరికిన తర్వాతే ఈ సెక్స్ రాకెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.

మరో ఘటనలో కుషాయిగూడలోని గ్రీన్ పార్క్ ఎన్‌క్లేవ్‌లో‌ వ్యభిచారం నిర్వహిస్తున్న లక్ష్మీ మిథిలి, విటులు కిశోర్ కుమార్, ఆర్యన్ ఖాన్, రమేష్, శ్రీశైలంలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 26ఏళ్ల సెక్స్ వర్కర్‌ను రెస్క్యూ హోంకి తరలించినట్లు చెప్పారు.

English summary
The Cyberabad SOT busted an online prostitution racket and rescued two sex workers. One organiser was arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X