ఆగడాలివే!: ‘ఆపరేషన్ నయీమ్’ ఆరు నెలల ముందు నుంచే(పిక్చర్స్)
హైదరాబాద్: షాద్ నగర్‌లో సోమవారం ఉదయం గ్రేహౌండ్స్ పోలీసులు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ నయీం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, నయీమ్ ఆగడాలకు పెరిగిపోవడంతో, వాటికి అడ్డుకట్ట వేసేం దుకు ఆరు నెలల కిందే 'ఆపరేషన్ నయీమ్' మొదలైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేసిన నయీమ్, అతడి ముఠా ఆట కట్టించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమచారం.
ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. ముందు నయీమ్ అనుచరులు లొంగిపోయేలా చూసింది. అతడికి సహకరిస్తున్న, అతనితో సంప్రదింపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించి.. వారిని గట్టిగా హెచ్చరించింది. అంతేగాక, నయీమ్‌తో సంబంధాలున్న పోలీసు ఉన్నతాధికారులకు ఆపరేషన్ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడింది.
నార్సింగ్ సోదాలు
నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో పోలీసులు అతనికి సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నార్సింగిలోని నయీమ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. నయీమ్ భార్య ఫర్హాన్ తోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు. నలుగురు ఆడపిల్లలను కస్తూర్బా పాఠశాలకు, నలుగురు మగ పిల్లలను సంక్షేమ హాస్టళ్లకు తరలించారు.
రూ. 2.08 కోట్లు, 1.8బంగారం స్వాధీనం చేసుకున్నారు. 4పిస్టోళ్లు, వేలకోట్ల విలువ చేసే డ్యాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 200 సెల్ ఫోన్లు, వందల సంఖ్యలో సిమ్ కార్డులు, 4 పిస్టోళ్లు స్వాధీనం చేసుకున్నారు.
వనస్థిలిపురంలోని నివాసంలోని సోదాలు చేసి రూ. 33లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
నల్గొండలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోదాలు చేపట్టి, నయీమ్ సోదరి ఆస్తానా నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. తమట శ్రీను నుంచి తపంచా, ల్యాండ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. జహంగీర్ అనే వ్యక్తి నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. మిర్యాల గూడలోని నయీమ్ అత్త, బావ మరిది, భార్య నుంచి 400 ల్యాండ్ డాక్యుమెంట్లు, 4డిటోనేటర్లు, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి ఎంపీపీ ఇంట్లో సోదాలు నిర్వహించి కూనపురి శంకర్, శ్రీశైలం గుండు వెంకటేశ్‌ల నుంచి తపంచా, 4డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.

‘ఆపరేషన్ నయీమ్'
షాద్ నగర్‌లో సోమవారం ఉదయం గ్రేహౌండ్స్ పోలీసులు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ నయీం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, నయీమ్ ఆగడాలకు పెరిగిపోవడంతో, వాటికి అడ్డుకట్ట వేసేం దుకు ఆరు నెలల కిందే 'ఆపరేషన్ నయీమ్' మొదలైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేసిన నయీమ్, అతడి ముఠా పనిపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమచారం.

‘ఆపరేషన్ నయీమ్'
ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. ముందు నయీమ్ అనుచరులు లొంగిపోయేలా చూసింది. అతడికి సహకరిస్తున్న, అతనితో సంప్రదింపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించి.. వారిని గట్టిగా హెచ్చరించింది. అంతేగాక, నయీమ్‌తో సంబంధాలున్న పోలీసు ఉన్నతాధికారులకు ఆపరేషన్ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడింది.

‘ఆపరేషన్ నయీమ్'
ఈ క్రమంలో మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నయీమ్ నేరుగా బెదిరించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.

‘ఆపరేషన్ నయీమ్'
మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లి, ఆయనతోనే గొడవపడి అంతు చూస్తాననడం.. నియోజకవర్గంలో తిరగొద్దంటూ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని హెచ్చరించడం, మరో ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి బూతులు తిట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది.

‘ఆపరేషన్ నయీమ్'
దీంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో భూ సెటిల్‌మెంట్లు చేయడం, భూముల యజమానులను బెదిరిం చి తక్కువ ధరకే లాక్కోవడం వంటి ఫిర్యాదులు లెక్కకు మించి వచ్చాయి.

‘ఆపరేషన్ నయీమ్'
మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలనే హెచ్చరించడంతో నయీమ్‌ను మట్టుబెట్టాలని ప్రభుత్వం పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

‘ఆపరేషన్ నయీమ్'
సన్నిహితుల లొంగుబాటుతో ఛత్తీస్‌గఢ్‌కు... భువనగిరి ప్రాంతంలో నయీమ్‌తో కలసి సెటిల్‌మెంట్లు చేసేవాళ్లను లొంగిపోవాల్సిందిగా పోలీసులు ఆదేశించడంతో నయీమ్ హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు మకాం మార్చాడు.

‘ఆపరేషన్ నయీమ్'
అక్కడ నక్సలైట్లను రూపుమాపేందుకు నయీమ్ ఉపయోగపడతాడని ఇక్కడి కొందరు పోలీసు అధికారులు చెప్పడంతో.. ఛత్తీస్‌గఢ్ ఉన్నతాధికారులు అతనికి ఆశ్రయమిచ్చారు. దీంతో నయీమ్ అక్కడి పోలీసు ఉన్నతాధికారుల సహాయంతో కాంట్రాక్టర్‌గా అవతారమెత్తాడు.

‘ఆపరేషన్ నయీమ్'
కొన్ని పను లు కూడా చేశాడు.తర్వాత కొన్నాళ్లకు హైదరాబాద్ చేరుకున్న నయీమ్... ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరించడం, వ్యాపారులను హెచ్చరించడం పోలీసుల దృష్టికి వచ్చింది.

‘ఆపరేషన్ నయీమ్'
దీంతో అతడిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో పక్కా ఆపరేషన్‌కు పోలీసులు రూపకల్పన చేశారు.అతడి సెల్ నంబర్లు, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నదీ గుర్తించారు. కొద్ది రోజులుగా షాద్‌నగర్-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు.

‘ఆపరేషన్ నయీమ్'
రెండు ప్రాంతాల్లోని నయీమ్ ఇళ్లపై వారంగా నిఘా పెట్టారు. అతడి కార్యకలాపాలు, వాటికి సంబంధించిన ఆధారాలను పూర్తిస్థాయిలో కనిపెట్టేందుకు ఆదివారం నుంచే రహస్యంగా వెంబడించడం ప్రారంభించారు. అయితే సోమవారం పోలీ సుల కదలికలను గుర్తించిన నయీమ్ కాల్పులకు దిగాడు.

‘ఆపరేషన్ నయీమ్'
పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నయీమ్ తమయ్యాడు.ఎమ్మెల్యేకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సాధారణంగా అయితే ముఖ్యమంత్రి, హోంమంత్రితోపాటు జెడ్ కేటగిరీలో ఉన్న వాళ్లకే బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సమకూరుస్తారు. కానీ నయీమ్ బెదిరింపుల నేపథ్యంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డికి పోలీసు శాఖ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చడంతో పాటు భద్రత ఏర్పాటు చేసింది.

‘ఆపరేషన్ నయీమ్'
'నయీమ్, అతడి ముఠా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నదీ, ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నదీ తెలిసింది. అధికార పార్టీలో కొందరితో సంబంధాలు పెట్టుకుని వారి కోసం సెటిల్‌మెంట్లు చేసినట్లు తేలింది' అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

‘ఆపరేషన్ నయీమ్'
‘కొందరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం, వ్యాపారంలో వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వాలని మరికొందరిని బెదిరించడం వంటివి మా దృష్టికి వచ్చాయి. కొందరు పోలీసు అధికారులతోనూ అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. దాంతో నయీమ్‌ను పట్టుకునేందుకు రహస్యంగా ఆపరేషన్ చేపట్టాం' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications