సీఎం కేసీఆర్ ఆ ఒక్క సంతకం - ఉద్యోగుల జీవితాల్లో కొత్త మలుపు..!!

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభ వేళ సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన నిర్ణయాలను ఆచరణలోకి తీసుకొచ్చారు. కొత్త సచివాలయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యగుల క్రమబద్దీకరణ పైన తొలి సంతకం చేసారు. ఆ వెంటనే ఆర్థికశాఖ జీవో-38 జారీచేసింది. ప్రపంచ కార్మికులంతా ఘనంగా నిర్వహించుకునే మేడేకు సరిగ్గా ఒక్కరోజు ముందు కాంట్రాక్టు వ్యవస్థలోని ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జీవో కూడా జారీ అయింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులకు ఎన్నో లాభాలు అందనున్నాయి.

పరిపాలనా సౌధంలో కొత్త నిర్ణయాలు:తెలంగాణ నూతన సచివాలయం నుంచి పాలన ప్రారంభించిన సీఎం కేసీఆర్ వేగంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆరు పైళ్లపై సంతకాలు చేసారు. 'పోడు'భూముల పంపిణీ కు సంబంధించిన నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 12,49,296 ఎకరాలకుగాను 4,14,353 క్లెయిమ్స్‌ను ఫారెస్ట్‌ కమిటీలు వివిధస్థాయిలో పరిశీలించిన అనంతరం 4,00,903 ఎకరాలకు సంబంధించి 1,55,393 మంది లబ్ధిదారులు పోడుపట్టాలకు అర్హత సాధించారు. సాధ్యమైనంత తొందరగా పోడుభూములకు పట్టాలు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాలిగన్‌ టెక్నాలజీని వినియోగించినట్టు ప్రకటించారు.

 CM KCRs gift to contract employees with one historical signature

కాంట్రాక్టు ఉద్యోగుల కోసం:ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరో హామీ నిలబెట్టుకున్నారు. మొత్తం 40 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న 5,544 మంది ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీచేయనున్నాయి. తెలంగాణలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని గతంలో భామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులు కొనసాగుతున్న వారి క్రమబద్దీకరణ పూర్తి కానుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెగ్యులర్‌ ఉద్యోగులవుతారు. అభద్రతాభావం తొలగిపోతుంది. పదవీ విరమణ వయసుతో సహా ప్రభుత్వ వీరికి అనేక అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. సీనియార్టీని బట్టి పదోన్నతులు లభించనున్నాయి. సెలవులు, భత్యాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రాధాన్యత దక్కుతుంది.

పెరగనున్న వేతనాలు:రెగ్యులర్ కానున్న ఉద్యోగులకు పీఆర్సీ, మెడికల్‌, ఈహెచ్‌ఎస్‌ తదితర సౌలభ్యాలను రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా అందుకుంటారు. హెచ్‌ఆర్‌ఏ, డీఏలను వర్తింపజేయడంతో ఒక్కో ఉద్యోగి వేతనం ఇప్పుడున్న దానికి అదనంగా రూ.25 వేల నుంచి 28 వేలు పెరుగనుందని అధికారులు చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు మెడికల్‌ లీవ్‌లు, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన చైల్డ్‌కేర్‌ లీవ్‌లు లభిస్తాయి. ఈఎల్స్‌, సీఎల్స్‌ అదనంగా లభిస్తాయి. జీపీఎఫ్‌ సౌకర్యం వర్తిస్తుంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు అనేక ప్రయోజనాలు పొందారు. గతంలో రూ.18 వేలుగా ఉన్న వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.37,100కు పెంచి బేసిక్‌ పే మంజూరు చేసింది. తొలి సారిగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేసారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఒక్క సంతకం ఇన్ని వేల కటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+