కాంగ్రెస్ Vs బీఆర్ఎస్, "గ్యారంటీ" గేమ్ ఛేంజర్ - ఏం జరుగుతోంది..!!
తెలంగాణలో అసలైన ఎన్నికల యుద్దం మొదలైంది. ఇప్పటికే అభ్యర్దులను ప్రకటించి బీఆర్ఎస్ రేసులో ముందుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు స్వయంగా సోనియా రంగంలోకి దిగారు. సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించి తమ టార్గెట్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలకు గ్యారంటీ స్కీంలను ప్రకటించారు. ఇది గేమ్ ఛేంజర్ గా మారుతుందిన భావిస్తున్నారు. జరిగే అవకాశం ఉందా.
గ్యారంటీ హామీలతో కాంగ్రెస్:కర్ణాటక తరువాత దక్షిణాదిన తెలంగాణ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. తాజాగా సోనియా గాంధీ పార్టీ రాష్ట్ర నేతలకు ఎలాగైనా గెలవాలని నిర్దేశించింది. పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ తాజా బహిరంగ సభ ద్వారా గ్యారంటీ పథకాలను ప్రకటించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటి గ్యారంటీల ద్వారానే ప్రజలు పార్టీకి దగ్గరయ్యారని చెబుతున్నారు.

అయితే, తెలంగాణలోనూ ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ఇప్పటికే ప్రతీ ఇంటికి సంక్షేమం అందిస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీంలు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు పైనా ప్రభావితం చూపటం ఖాయమని కాంగ్రెస్ చెబుతుంటే...గులాబీ నేతలు మాత్రం అవకాశం లేదంటున్నారు.
బీఆర్ఎస్ పై ప్రభావం :కాంగ్రెస్ హామీలను ప్రజలను నమ్మరనేది బీఆర్ఎస్ నేతల వాదన. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద రూ.75 వేల కోట్లను రైతు ఖాతాల్లో జమ చేశారు. దీనినే కాంగ్రెస్ కాపీ కొట్టి రైతుభరోసాగా పేరు మార్చింది. కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతులను గుర్తించడం పెద్ద సమస్య అని, పొలానికి సంబంధించి పెట్టుబడి సాయం రైతుకు ఇస్తారా? కౌలురైతుకు ఇస్తారా? లేదా ఇద్దరికీ ఇస్తారా అనేది స్పష్టత లేదు.
కౌలు రైతులు, కూలీలకు కలిపి కోటి మందికిపైగా ఇవ్వాల్సి ఉంటుందని, ఎలా సాధ్యమనే వాదన ఉంది. గత ఎన్నికల్లోనూ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్‌ను కాకుండా రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్‌ను నమ్మి ఓటేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా కాంగ్రెస్ హామీలను నమ్మే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు.

గులాబీ నేతల ధీమా:గృహలక్ష్మి పథకాన్ని కాపీ కొట్టి కాంగ్రెస్ మళ్లీ 'ఇందిరమ్మ ఇండ్లు' అని ప్రకటించిందని చెబుతున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం అమలవుతున్నది. ఈ పథకాన్ని కాంగ్రెస్ కాపీ కొట్టి మరో 100 యూనిట్లు పెంచి 'గృహజ్యోతి' అని ప్రకటించిందనే వాదన ఉంది. పెన్షన్ల విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ హామీలు అమలయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.
రాష్ట్ర ఆదాయవ్యయాలను దృష్టిలో పెట్టుకొని పథకాలు ప్రకటించి, అమలు చేసినప్పుడే వాటికి విలువ, ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూస్తుంటే ఒక్క తెలంగాణ బడ్జెట్ సరిపోయే పరిస్థితిలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో, ఇప్పుడు కాంగ్రెస్ హామీలతో తమకు నష్టం లేదనేది బీఆర్ఎస్ ధీమాగా కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications