Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆధ్యాత్మిక పరిమళం - రూ 2,500 కోట్లతో దేవాలయాలకు కొత్త రూపు..!!

తెలంగాణలో దేవాలయాలకు కొత్త రూపు కనిపిస్తోంది. ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలతో పాటుగా ఎంతో చరిత్ర ఉన్న దేవాలయాల పునరుద్దరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. భారీగా నిధులు మంజూరు చేస్తోంది. దశల వారీగా దేవాలయాలతో పాటుగా ఆలయ భూముల పరిరక్షణకు నిర్ణయాలు తీసుకుంటోంది. దేవాలయల రోడ్లు, సత్రాలు, మంచినీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోంది. నిత్యం ధూప, దీప నైవేద్యాలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో దాదాపు రూ 2500 కోట్లు ఖర్చు చేసింది.

ఆలయల పునరుద్దరణకు ప్రాధాన్యత
తెలంగాణలోని ప్రముఖ ఆలయాల పునరుద్దరణకు ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యాదాద్రి కొత్త హంగులతో ఆధ్మాత్మిక నగరంగా మారింది. భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతీ ఒక్కరూ ఆలయ పుననిర్మాణం చేసిన తీరును ప్రశంసిస్తున్నారు. ఇక, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం..బాసర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల పునరుద్దరణ పైన శ్రద్ద చూపిస్తున్నారు. ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరంతదితర ప్రధాన ఆలయాలకు పెద్ద ఎత్తున నిధులు చేస్తున్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు సదుపాయాల కల్పనలోనూ ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Opinion: KCR govt keen on developing temples, spend rs 2500cr

టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యత
భక్తులు సులభంగా దేవాలయాల సందర్శనకు వీలుగా ప్రభుత్వం టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తోంది. యాదగిరిగుట్ట, వరంగల్‌ వేయి స్తంభాలగుడి, కాళేశ్వరం, కొండగట్టు, ధర్మపురి, బాసర, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయ పుననిర్మాణం తరువాత యాదాద్రిని రోజుకి సగటున 45 వేల నుంచి 50 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా కొండగట్టు దేవాలయానికి సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకు అయినా సిద్దమని..ప్రపంచ స్థాయిలో నిలిచేలా ఆలయ పునరుద్దరణ- విస్తరణ పనులు ఉండాలని నిర్దేశించారు.

ఆలయ భూముల పరిరక్షణ
దేవాలయాలతో పాటుగా ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా అన్యాక్రాంతమైన దాదాపు 5,050 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ దేవాలయాలకు క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతండంతో ఆన్ లైన్ సేవలకు శ్రీకారం చుట్టారు. పూజలు, అర్చనలు, ఇతర సేవలను ముందుగా బుకింగ్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక.. ఆలయ అభివృద్ధి కమిటీలు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి పనులు చేపడుతున్నాయి. దీనికి అవసరమైన నిధులను దేవాదాయశాఖ ఆమోదిస్తోంది. దీంతో ఫలితంగా రాష్ట్రంలో దేవాలయాలకు కొత్త రూపుతో తెలంగాణలో ఆధ్మాత్మిక పరిమళం వెల్లి విరుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+