శుక్రవారం లెఫ్ట్ తెలంగాణ బంద్: కెసిఆర్‌పై విపక్షాల సమైక్య పోరు
హైదరాబాద్: ప్రతిపక్షాలు తెలంగాణ కొత్త రాష్ట్రంలో తొలి బంద్‌కు పూనుకున్నాయి. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ, సిపిఎంలతో పాటు తొమ్మిది వామపక్షాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా వామపక్షాలు చేపట్టిన దీక్షలను పోలీసులు బుధవారం రాత్రి భగ్నం చేశారు. దాంతో వామపక్షాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.
కాగా, వామపక్షాల బంద్‌కు అన్ని ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం, కాంగ్రెసు, బిజెపిలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. మావోయిస్టులు కూడా బంద్‌కు మద్దతు ప్రకటించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ప్రతిపక్షాలు గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా రేపు వామపక్షాలు చేపట్టిన బంద్‌కు టీడీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేతలు సీతక్క, దొమ్మాటి సాంబయ్య తెలిపారు. ఇష్టానుసారం హామీలు గుప్పించి నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతున్న కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. మునిసిపల్ కార్మికుల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కార్మికులకు అండగా ఉంటామన్నారు.
దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా వామపక్షాలు గురువారంనాడు హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేశాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వస్తే బంద్‌ను విరమించుకుంటామని వామపక్షాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications