భాగ్య నగరవాసులు ఖాళీ దొరికితే ఇక్కడికే క్యూ కడతారు.. 20 కి. మీ దూరంలోనే..

హైదరాబాద్ వాసులు ఖాళీ సమయాల్లో ప్రశాంతంగా సేదతీరేందుకు అనువుగా... అందమైన, ఆహ్లాదకర ప్రదేశం ఉందని మీకు తెలుసా..? హైదరాబాద్ కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రకృతి రమణీయమైన ప్రదేశం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ లేక నిండు కుండలా తొణికిసలాడుతూ హైదరాబాద్ వాసులకు ఒక ప్రశాంతమైన విహార ప్రదేశంగా మారింది. గండిపేట చెరువు అని పిలిచే ఈ ప్రాంతం నగర ప్రజలకు ఫర్ ఫెక్ట్ పిక్నిక్ ప్రదేశంగా ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇక్కడ ఆహ్లాదంగా సేద తీరవచ్చు. అందుకే ఈ ప్రాంతానికి నగర వాసులు క్యూ కడుతున్నారు. గతంలో ఉస్మాన్‌ సాగర్ గండిపేట వద్ద ప్రకృతి పరవశించేలా ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అత్యంత సుందరంగా ఎకో పార్కును తీర్చిదిద్దారు. పర్యాటకులు సేదతీరేందుకు వీలుగా అత్యాధునిక సదుపాయాలతో పార్కును నిర్మించారు.

గండిపేట చరిత్ర ఓసారి చూస్తే.. 1908 లో మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. ఈ క్రమంలో అప్పటి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు గండిపేట గ్రామం వద్ద మూసీ నదిపై 1920లో ఆనకట్ట నిర్మించారు. గండిపేటకు జంట జలాశయం అయిన హిమాయత్‌ సాగర్‌ ను కూడా నిజాం ప్రభుత్వంలో నిర్మించారు. హిమాయత్‌ సాగర్‌ ను 1927లో నిర్మించారు. ఈ రెండు జలాశయాలు అప్పటి నుంచి నగర ప్రజల దాహార్తిని తీరుస్తూ ప్రసిద్ధిచెందాయి.

Osman Sagar Brims Over Crowds Flock to Hyderabad s Gandipet Park

గండిపేట వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ఐదున్నర ఎకరాల్లో 35కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. జలాశయం అందాలను ఆహ్లాదకర వాతావరణం మధ్య చూడటం నగరవాసులకు కనువిందుగా అనిపిస్తుంది. గండిపేట వచ్చే సందర్శకులకు ఈ పార్కు ఏర్పాటుతో మౌలిక వసతుల కొరత తీరింది. ఎంట్రెన్స్ ప్లాజాతోపాటు వాక్ వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పాట్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే ఉదయం 7 నుంచి రాత్రి 7:30 వరకు ఈ పార్క్ తెరిచే ఉంటుందట. ఇక ఈ గండిపేట చెరువును చూసేందుకు వారాంతాల్లో 50,000 నుంచి 1 లక్ష మంది వరకు సందర్శకులు గండిపేటకు వస్తుంటారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+