హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయులో తెరాస ఎమ్మెల్యే కబ్జా: పేదలు, విద్యార్థుల మధ్య కేసీఆర్ చిచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల పరిరక్షణ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఐకాస నేతలు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలతో ఓయూకి వందలాది ఎకరాల భూమిని కేటాయించారని, కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ భూమి ఆక్రమణల పాలైందన్నారు.

ఇప్పుడు మిగిలిన భూమిలోనూ పేదలకు ఇళ్లు నిర్మిస్తామంటూ సీఎం ప్రకటిస్తున్నారని తెలిపారు. వర్సిటీ చాన్సలర్‌గా జోక్యం చేసుకుని విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, తెలంగాణ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, ఓయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కె విజయ కుమార్‌ తదితరులు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

అనంతరం శ్రవణ్‌ విలేకరులతో మాట్లాడారు. పేదల ఇళ్ల కోసం ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ల్యాంకో హిల్స్‌, నార్నే ఎస్టేట్‌ వంటి సంస్థల భూములను తీసుకోవాలని, ఉస్మానియా భూముల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

దయాకర్‌ మాట్లాడుతూ.. ఓయూ భూములు తీసుకుంటూ కేసీఆర్‌ పేదలు, విద్యార్థుల మధ్య అగ్గిని రాజేస్తున్నారని ఆరోపించారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు విజయ్ కుమార్‌ మాట్లాడుతూ అధికార తెరాస పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే యూనివర్సిటీ భూమిని ఆక్రమించుకుని హోటల్‌ను, ఇంటిని నిర్మించుకున్నారని, ముందుగా సీఎం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని వర్సిటీకి అప్పగించాలన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం భూముల స్వాధీన నిర్ణయాన్ని విరమించుకోకపోతే విద్యార్థులు ఆ ఎమ్మెల్యే ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. పోరాడటం చేతకాక 2009లో కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్షను అర్ధాంతరంగా విరమిస్తే, ఆత్మ బలిదానాలతో విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని బతికించారని ప్రకటనలో పేర్కొన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

మా త్యాగాలతో సిద్ధించిన తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని మమ్మల్నే మెచ్యురిటీలేని పోరగాళ్లు అని హేళన చేస్తావా? త్వరలోనే నీ క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కేసీఆర్‌ను ఓయూ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్దికోసమే కేసీఆర్‌ రాజకీయ డ్రామా ఆడుతున్నారని, సీఎం పర్యటనలను అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఏబీవీపీ విద్యార్థులు దగ్ధం చేశారు.

English summary
Students of OU intensified their protests on Friday with the state government refusing to go back on its decision to take over 11 acres of campus land for housing needs of the poor. On Friday, 20 students sat on a relay hunger strike demanding that the state government roll back its decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X