దళిత విద్యార్థినికి వేధింపులు: శాస్త్రవేత్త అరెస్ట్
ఃహైదరాబాద్: దళిత విద్యార్థినిని వేధించారనే ఆరోపణలపై హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (నిన్) శాస్త్రవేత్త భాస్కరాచారిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో మే 18న భాస్కరాచారిపై కేసు నమోదైందని, విచారణ జరిపి అన్ని ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. భాస్కరాచారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు కాచిగూడ ఏసీపీ నర్సయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications