హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గర్వపడేలా చేశారు: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫ్లైవెయిట్(52కేజీ) విభాగంలో బంగారు పతకం సాధించని బాక్సర్ నిఖత్ జరీన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విభాగంలో బంగారు పతకం సాధించిన ఐదో భారత మహిళగా ఆమె రికార్డు సాధించారు. వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు, వెండి పతకాలు సాధించి భారత ప్రజలను గర్వపడేలా చేశారంటూ ప్రధాని మోడీ బాక్సర్లను కొనియాడారు.

నిఖత్ జరీన్ తోపాటు బాక్సర్లకు ప్రధాని మోడీ అభినందనలు

గురువారం ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌పై 5-0 తేడాతో అద్భుతమైన విజయంతో ప్రతిష్టాత్మకమైన స్వర్ణాన్ని కైవసం చేసుకున్న జరీన్ అంచనాలను అందుకుంది. జరీన్ స్వర్ణ పతకం సాధించగా, మనీషా మౌన్ (57 కేజీలు), అరంగేట్రం క్రీడాకారిణి పర్వీన్ హుడా (63 కేజీలు) కూడా కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

బంగారు పతకం సాధించిన నిఖత్ జరీనాతోపాటు బ్రాంజ్ మెడల్స్ సాధించిన మనీషా మౌన్, పర్వీన్ హుడాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

గర్వపడేలా చేశారంటూ మహిళా బాక్సర్లను కొనియాడిన ప్రధాని మోడీ

గర్వపడేలా చేశారంటూ మహిళా బాక్సర్లను కొనియాడిన ప్రధాని మోడీ

భారత మహిళా బాక్సర్లు దేశ ప్రజలను గర్వపడేలా చేశారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. కాగా, మే 19, 2022న జరిగిన పోటీలో జరీన్ తన ప్రత్యర్థులందరిపై ఆధిపత్యం చెలాయించింది. అద్భుతమైన ముగింపు ఇచ్చింది. తెలంగాణకు చెందిన బాక్సర్ తన జరీన్.. థాయ్ ప్రత్యర్థిని ఓడించి ఏకగ్రీవ తీర్పు ద్వారా ఘన విజయం సాధించింది. ఈ బౌట్‌లో న్యాయమూర్తులు ఆమెకు అనుకూలంగా 30-27, 29-28, 29-28, 30-27, 29- 28 స్కోర్ చేశారు.

ఇంతటి భారీ విజయాన్ని ఊహించలేదన్న నిఖత్ జరీన్

ఇంతటి భారీ విజయాన్ని ఊహించలేదన్న నిఖత్ జరీన్

ఫైనల్‌లో ఇంత భారీ విజయాన్ని సాధిస్తామని తాను ఊహించలేదని గెలుపు అనంతరం నిఖత్ జరీన్ తెలిపింది. అయితే, తాను ఏకగ్రీవంగా విజయం సాధించాలని కోరుకున్నట్లు వెల్లడించింది. 2019 ఏషియన్ ఛాంపియన్‌షిప్ బ్రాంజ్ మెడలిస్ట్ అయిన జరీన్.. వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించిన ఐదో క్రీడాకారిణి కావడం విశేషం.

కాగా, ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖా కెసి (2006) ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఇతర బాక్సర్లు. నాలుగేళ్లలో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం. మేరీ కోమ్ (48 కేజీలు) 2018లో చివరిసారిగా టైటిల్‌ను గెలుచుకుంది.

English summary
'Our Boxers Have Made Us Proud': PM Modi Lauds Nikhat Zareen's Gold Win At World Championship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X