వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు డ్రైవర్ ఖాతాలో 7 కోట్ల నగదు డిపాజిట్, జరిమానా చెల్లించేందుకు సిద్దమంటూ ప్రకటన

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకు అక్రమార్కులు వక్రమార్గాలను అవలంభిస్తున్నారు.అయితే ఇంత వరకు అంతగా వినియోగంలో లేని బ్యాంకు ఖతాలను ఉపయోగించుకొంటున్నారు. హైద్రాబాద్ కు చెందిన ఓ కారు డ్రైవర్ ఖాతాలో విడతల వారీగా ఏడు కోట్ల నగదును డిపాజిట్ అయింది. ఈ నగదును ఓ బంగారు వర్తకుని ఖాతాకు బదిలీ అయినట్టు అధికారులు గుర్తించారు. కారు డ్రైవర్ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు పోలీసులు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత హైద్రాబాద్ కు చెందిన ఉబేర్ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో 7 కోట్ల రూపాయాల నగదు జమ అయింది. ఈ నగదును మరో ఇద్దరితో కలిసి ఆయన బ్యాంకులో జమ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

రద్దు చేసిన ఐదువందల రూపాయాలు, వెయ్యి రూపాయాల నగదును బ్యాంకు డ్రైవర్ ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. అయితే పెద్ద నగదు నోట్ల రద్దుకు ముందు ఈ ఖాతా అంతగా మనుగడలో లేదు. అయితే పెద్ద నగదు నోట్లు రద్దుచేసిన తర్వాత ఈ ఖాతా క్రియాశీలకంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు..

over rs. 7 crore deposits found cab drivers account in hyderabad

బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఆదాయపు పన్ను శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. విడతల వారీగా 7 కోట్ల రూపాయాలను ఈ ఖాతాలో జమ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ డబ్బును ఓ బంగారు వర్తకుడి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు.

అయితే ఈ నగదు ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై ఆదాయపుపన్నుశాఖాధికారులు బ్యాంకు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.అయితే ఈ డబ్బుకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పన్ను కట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు క్యాబ్ డ్రైవర్ ప్రకటించారు. పన్ను కింద సుమారు మూడున్నర కోట్లను చెల్లించాల్సి ఉంది.మరో 25 శాతం పిఎంజికెవై పథకంలో నాలుగేళ్ళపాటు లాకిన్ డిపాజిట్ గా ఉంచాల్సి ఉంటుంది.

English summary
Income tax officers found around rs.7 crore deposits cab drivers account in hyderabad, after demonetasation cab drivers accont phase wise 7 crore rupees deposit in sbh account in hyderabad, income tax officers enquiry this amount, cab driver agree to pay penalty of 3.5 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X