Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2016: హైదరాబాద్ విమానాశ్రయంలో పాకిస్తాన్ సింగర్‌కు చుక్కలు, కారణం ఇదే

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి అబుదబీ నుంచి హైదరాబాద్ వచ్చిన పాకిస్తాన్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్‌కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం చుక్కెదురయింది.

అతను ఎమిరేట్స్ విమానంలో అబుదబీ నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై అయిదు నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అతనిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. అతడు పాకిస్తాన్ దేశానికి చెందినవాడిగా అధికారులు గుర్తించారు.

దీంతో అతడిని అదే విమానంలో దుబాయ్ తిప్పి పంపించారు. పాకిస్తాన్ ప్రయాణీకులు నేరుగా శంషాబాద్ విమానాశ్రయంకు వచ్చేందుకు అవకాశం లేదని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ రావాలనుకుంటే ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి డొమెస్టిక్ విమానాల ద్వారా ఇక్కడకు రావాలని అతనికి సూచించారు.

Pak singer Rahat Fateh Ali Khan deported from Hyderabad

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తన సంగీతాన్ని వినిపించేందుకు పాక్ సంగీత దిగ్గజం రహత్ ఫతే అలీ ఖాన్ గురువారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. నిబంధనల కారణంగా అతనికి అధికారులు చుక్కలు చూపించారు.

అబూదాబీ నుంచి ఆయన దిగగానే, తిరిగి అదే విమానంలో వెనక్కు పంపించారు. ఆయన ప్రయాణడాక్యుమెంట్లలో సాంకేతిక లోపాలున్నాయని అధికారులు చెప్పారు. ఎవరైనా పాకిస్థాన్ దేశస్తులు నేరుగా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగేందుకు నిబంధనలు అనుమతించవని చెప్పి అతనిని తిరుగు విమానం ఎక్కించారు.

కాగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై మెట్రో విమానాశ్రయాల నుంచి మాత్రమే పాకిస్తాన్ జాతీయులు భారత్‌లో అడుగు పెట్టాల్సి ఉంది. దీంతో సాయంత్రం ఎనిమిది గంటలకు జరగాల్సిన అతని సంగీత ప్రదర్శన రాత్రి పదకొండు గంటలకు వాయిదా పడింది.

సమాచారం మేరకు... అలీ ఖాన్ తిరిగి అబూదాబీ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి, మరో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ముందు జరగాల్సిన సంగీత ప్రదర్శన, నూతన సంవత్సరం వచ్చిన తర్వాత మొదలు కాగా రాత్రి ఒంటి గంట వరకూ మాత్రమే వేడుకలకు అవకాశం ఉండటంతో, కొద్దిసేపు మాత్రమే అలీ ఖాన్ సంగీత ప్రదర్శన జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+