హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు.. పాకిస్థాన్ అమ్మాయిలు బ్యాన్ ?

తెలంగాణ రాజధాని, విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పోటీలు తొలిసారిగా హైదరాబాద్ లో జరగనుండటం విశేషం. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పోటీలు మే 7 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోనే ఈ మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు జరగనున్నాయి.

ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలు 28 సంవత్సరాల తర్వాత భారత్‌లో జరగనున్నాయి. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి యువతులు పాల్గోననున్నారు.ఇక ఈ మిస్ వరల్డ్ పోటీలను 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ స్థాపించారు. అప్పటినుంచి ఈ ఐకానిక్​ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నాయి. తాజాగా ఈ ఏడాది పోటీలు హైదరాబాద్ లో నిర్వహించడం రాష్ట్రానికి శుభపరిణామంగా భావించవచ్చు. ఈ పోటీల ద్వారా ప్రపంచం దృష్టి మరోసారి భాగ్యనగరంపై ఉంటుంది.

అయితే ఇటీవల జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి దృష్ట్యా పాకిస్థాన్ పై సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే సింధూ నదీ జలాలు పాక్ కు వెళ్లకుండా చర్యలు తీసుకుంది. భారత్ లోని పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ యువతులను హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటారా? అనే సందేహం నెలకొంది. తాజా పరిణామాలు గమనిస్తే పాకిస్థాన్ అమ్మాయిలకు భారత్ లో ఎంట్రీ లేనట్లే కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Pakistani Contestants Barred from Miss World 2025 in Hyderabad

జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 అమాయకులు మృతి చెందారు. అంతేకాక పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా, హేయమైనదిగా అభివర్ణించాయి. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పాకిస్థాన్ కు చెక్ పెట్టేందుకు 5 సంచలన నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంది. పాకిస్థాన్ పై దెబ్బకు దెబ్బ తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+