
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పాల్వాయి స్రవంతి కీలక వ్యాఖ్యలు..!!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన పాల్వాయి స్రవంతి కలక వ్యాఖ్యలు చేసారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్దిగా నిలిచిన స్రవంతి తాను వెంకటరెడ్డిని సొంత అన్నగా భావించానని చెప్పుకొచ్చారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో తన సోదరుడు ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయంటూ అడిగిన ఆడియో లీక్ కాంగ్రెస్ కలకలానికి కారణమైంది. తాను ఆడబిడ్డగా మునుగోడు లో ఒంటరి పోరాటం చేస్తున్నానని స్రవంతి చెప్పారు. కోమటిరెడ్డిని కలిసిన తాను ఉప ఎన్నికల్లో సహకరించాలని.. తనకు ధైర్యం కూడా అయనేని చెప్పానని గుర్తు చేసారు.
కానీ, ఇప్పుడు వెంకటరెడ్డి తీరు తనకు ఆవేదన కలిగిస్తోందన్నారు. పార్టీ ఎంపీగా ఉంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నమ్మకద్రోహంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. తనకు ఆర్దికంగా బలం లేకపోవచ్చు కానీ, ప్రజా బలం ఉందని స్రవంతి చెప్పుకొచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ లో వెలుగులోకి వచ్చిన సంభాషణతో పాటుగా.. ఆస్ట్రేలియాలో పార్టీ కార్యకర్తలతో వెంకట రెడ్డి ,చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. అటు బీజేపీ..ఇటు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నాయని, కాంగ్రెస్ లో ఎవరు డబ్బు ఖర్చు చేయాలని ప్రశ్నించారు.

తాను ప్రచారానికి వెళ్తే పది వేల ఓట్లు వస్తాయని, కానీ ఓడిపోయే ఎన్నికల్లో ప్రచారం ఎందుకని వ్యాఖ్యానించారు. తాను పాదయాత్ర చేద్దామని భావించానని, అయితే కాంగ్రెస్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో గ్రూపుగా మారిందని చెప్పారు. పాతికేళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఇక చాలంటా కోమటిరెడ్డి వెంటకరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కోమటిరెడ్డి పైన చర్చలకు రంగం సిద్దం అవుతోందనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. మునుగోడు బై పోల్ తరువాత చర్యలు తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు కోమటిరెడ్డి వ్యవహారం రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర వేళ బిగ్ డిబేట్ గా మారుతోంది.