'కోమట్లు పుస్తకంపై పరిపూర్ణానందకేం సంబంధం, యోగిలా సీఎం కావాలనుకుంటున్నారు'
వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య రాసిన పుస్తకం మీద నిలదీసిన పరిపూర్ణానంద స్వామిపై సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ ఐలయ్య వ్యవహారంలో పరిపూర్ణానందకు ఏం సంబంధం అని విచిత్ర వాదన తెచ్చారు.
అమరావతి: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య రాసిన పుస్తకం మీద నిలదీసిన పరిపూర్ణానంద స్వామిపై సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ ఐలయ్య వ్యవహారంలో పరిపూర్ణానందకు ఏం సంబంధం అని విచిత్ర వాదన తెచ్చారు.
చదవండి: కోమట్లు ఇష్యూ: ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక విసురుగా వెళ్లిపోయిన ఐలయ్య

యోగిలా సీఎం కావాలనుకుంటున్నారు
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని పరిపూర్ణానంద స్వామి తపిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారని, తాను కూడా ఇక్కడ అలా కావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ఉందన్నారు.

ఎప్పుడో రాసిన పుస్తకం నుంచి..
2007 సంవత్సరంలో ఇంగ్లిష్‌లో రాసిన పుస్తకాన్ని ఐలయ్య 2011లో తెలుగులోకి తర్జుమా చేశారని, ఇందులోని కొన్ని అధ్యాయాలను తిరిగి చిన్న పుస్తకాలుగా తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆర్యవైశ్యులు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ భౌతికదాడులకు దిగుతామని బెదిరించడం తగదన్నారు.

అందుకే పుస్తకం
కాగా, ప్రస్తుతం పుస్తకం రాయాల్సి వస్తే ప్రస్తుత పరిస్థితి అనుగుణంగా రాస్తానని ఐలయ్య చెప్పారు. దీనిని రామకృష్ణ గమనించినట్లుగా లేదని, పైగా ఇప్పుడు సమాజంలో మార్పు వచ్చిందని చెప్పినప్పుడు ఎప్పుడో రాసిన పుస్తకం అంటూ తిరిగి వాటిని చిన్న పుస్తకాలుగా తీసుకు రావడం ఏమిటని వైశ్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టడం, వివాదాస్పదంతో అందరి నోళ్లలో నానేందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు.

కంచ ఐలయ్య రచనలు సమర్థిస్తూ చిచ్చుపెడతారా?
మరోవైపు, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కంచె ఐలయ్య రచనలను సమర్ధిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని, ఆ పార్టీలకు ఆయా కులస్థులు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పాలని బిజెపి యువ మోర్చా ఏపీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కడపలో పిలుపునిచ్చారు.

రణదీప్ అలా మాట్లాడటమా
కంచె ఐలయ్య రచనలను సమర్థిస్తూ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని విష్ణు అన్నారు. సీపీఎం కూడా కంచె ఐలయ్య రచనలకు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications