కెసిఆర్ అభివృద్ధి పనులే, రుణపడి ఉంటా: పసునూరి దయాకర్
వరంగల్: వరంగల్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని విజయం దిశగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వరంగల్ లోకసభ అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. వరంగల్ నియోజకవర్గం ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపించాయని ఆయన అన్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మంగళవారంనాడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెసిఆర్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించడం వల్లనే భారీ మెజారిటీతో తాను గెలుస్తున్నట్లు తెలిపారు. వరంగల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
కెసిఆర్ తనపై పెద్ద బాధ్యత పెట్టారని ఆయన చెప్పారు. తనపై కెసిఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు నమ్మారని ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. అందరి సహకారంతోనే ఈ విజయం సాధించామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల కోసం, పార్టీ బలోపేతంకోసం కృషి చేస్తానని దయాకర్ స్పష్టం చేశారు.

వరంగల్ లోక్‌సభ ఉప పోరు ఓట్ల లెక్కింపులో తెరాస ఆధిక్యం కొనసాగుతోంది. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో రౌండ్ రౌండుకు టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు ఓట్ల ఆధిక్యత పెరుగుతోంది. 9 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 2 లక్షల 20 వేలకు పైగా మెజారిటీతో ఉన్నారు.












Click it and Unblock the Notifications