తన ఫ్యాన్స్‌ను అభినందించిన పవన్: ఎందుకంటే..?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలు, అభిమానులను అభినందించారు. వారు చేసిన మంచి పని పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఆయన అభిమానులు చేశారంటే.. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ. 1000, రూ. 500ల మార్పిడి కోసం ఇబ్బంది పడుతున్న రోగులు, వారి సహాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు సహాయం చేశారు.

pawan kalyan appreciates his fans

ఆదివారం రోజు వారు నిమ్స్‌ ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి సహాయకుల వద్ద ఉన్న పెద్ద నోట్లను తీసుకుని చిన్న నోట్లను ఇచ్చారు. సమస్యలపై నిలదీద్దాం, ప్రశ్నిద్దాం, సాయం చేద్దామని తమ అధినేత ఇచ్చిన ప్రేరణతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.

అయితే వీరిని అభినందిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. వివిధ సమస్యలతో నిమ్స్‌కి వచ్చే రోగులపై దయతో వారికి సహాయం చేసిన 'జనసేన' కార్యకర్తలకు, మద్దతుదారులకు హృదయపూర్వక అభినందనలు అని పవన్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena Party president Pawan Kalyan appreciated his fans for helping people in NIMS Hospital.
Please Wait while comments are loading...